ISROs Diwali Gift

Isros diwali gift

India's communication satellite, GSAT-15 Satellite, Korou french guiana, space craft, GSAT-15, DTH Services, Communications Satellite, Tele-Communications Satellite, Arabsat, Ariane-5, Ariane-5 Rocket, Space, Space Transponders, ISRO, Indian Space Research Organisation

The Indian Space Research Organisation has given the nation the most appropriate Diwali gift - An indigeneously made communications satellite GSAT-15. It was successfully launched at 03:04 am (IST) today, using one of the world's largest rockets - the Ariane-5. The launch took place from Kourou in French Guyana in South America.

నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-15

Posted: 11/11/2015 04:46 PM IST
Isros diwali gift

దేశంలో అన్ని ప్రాంతాల్లో దీపావళి వెలుగులు వెలుగుతున్నాయి. అయితే అంతరిక్షంలో కూడా మన తారా జువ్వను వెలిగించింది ఇస్రొ. తాజాగా జీశాట్-15 ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపి.. దీపావళి వెలుగులను రెట్టింపు చేసింది ఇస్రో. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరౌ నుంచి తెల్లవారుజామున 3-04 గంటలకు దీనిని ప్రయోగించినట్లు ఇస్రో తెలిపింది. టెలికమ్యూనికేషన్ల సేవలకు, నేవిగేషన్‌, అత్యవసర సేవలకు ఉపయోగపడేలా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. అరబ్‌శాట్‌-6బిని రోదసిలోకి పంపిన తర్వాత జీశాట్ -15ను జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి పంపించారు. జీశాట్‌-15 బరువు 3,164 కేజీలు. ఇన్‌శాట్, జీశాట్‌ సిస్టమ్‌లోకి పంపించిన అత్యంత శక్తిమంతమైన ఉపగ్రహం జీశాట్‌ -15. కేయూ బ్యాండ్‌లో 24 కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌పాండర్లను మోసుకుపోగలదు. ఎల్‌1, ఎల్‌5 బ్యాండ్లలో జీపీఎస్‌ ఎయిడెడ్‌ జీఈఓ ఆగ్‌మెంటెడ్‌ నేవిగేషన్‌ పేలోడ్‌తో పని చేస్తుంది.

కౌరౌలో ఇస్రో ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్‌ ఎం. అన్నాదురై మాట్లాడుతూ జీశాట్-15 ఉపగ్రహం సంకేతాలు కర్ణాటకలోని హసన్‌లో ఉన్న మాస్టర్‌ కంట్రోల్ ఫెసిలిటీ స్వీకరించినట్లు తెలిపారు. ఇనిషియలైజేషన్‌ కమాండ్స్‌ ప్రక్రియ కొనసాగుతోందని, ఉపగ్రహం బాగా పని చేస్తోందని చెప్పారు. జీశాట్‌-15తో దేశంలోని కేయూబ్యాండ్ యూజర్లకు నిరంతర సేవలు అందజేయడానికి వీలవుతుందన్నారు. పౌర విమానయానం, తదితర సేవలకు ఇది ఉపయోగపడుతుందన్నారు. జీశాట్‌-17, జీశాట్‌-18 ఉపగ్రహాలను వచ్చే ఏడాది ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. జీశాట్‌-15 ప్రయోగం వల్ల ఉపగ్రహ చోదక మౌలిక సదుపాయాల వ్యవస్థ బలోపేతం దిశగా ముందడుగు పడినట్లయిందన్నారు. దేశంలోని కమ్యూనికేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సుస్థిరమవుతుందని ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles