Nitish Kumar to Take Oath as Bihar Chief Minister

Nitish kumar to take oath as bihar chief minister

Bihar, elections, Nitesh Kumar, lalu Prasad, Nitesh Kumar as Bihar cm, Nitesh take oath as Bihar CM

Grand Alliance leader Nitish Kumar will again take oath as Bihar chief minister along with a 35-member council of ministers after the Chhath festival to be celebrated in the third week of November, a JD(U) leader said. "A 36-member Cabinet including Chief Minister Nitish Kumar will take oath after the Chhath festival," said a Janata Dal-United leader.

నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం అప్పుడే

Posted: 11/10/2015 08:39 AM IST
Nitish kumar to take oath as bihar chief minister

బీహార్ ఎలక్షన్ లో ఎన్డీయే పక్షానికి గట్టి ఎదురుదెబ్బ తీసిన నితీష్ కుమార్ అఖండ మెజారిటీతో అధికారానికి చేరువయ్యారు. ఆర్జేడీ, జెడియు, కాంగ్రెస్ పార్టీలతో కలిసి అధికార పీఠాన్ని వశం చేసుకోనున్నారు. అంతకు ముందే ప్రకటించినట్లు మహా కూటమి తమ సిఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ ను సిఎం కుర్చీ మీద కూర్చోబెట్టడానికి అంతా సిద్దమైంది. బిజెపి పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తూ.. నితీష్ కుమార్ హవా బీహార్ లో కొనసాగింది. ఎలక్షన్ ఫలితాలు కూడా వచ్చేశాయి.. నితీష్ కుమార్ సిఎం గా ప్రమాణ స్వీకారం చెయ్యడానికి మంచి ముహూర్తం కూడా కుదిరింది. ఈ నెల 20న బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చెయ్యడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి.

బీహార్ సిఎంగా నితీష్ కుమార్ మూడో సారి ప్రమాణ స్వీకారం చెయ్యడానికి సిద్దమవుతున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో నితీష్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. బీహార్ ను అభివృద్ది పథంలొ నడిపించిన నితీష్ ను మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు బీహారీలు. నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సిఎంలు, కీలక నేతలు, జాతీయ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయించుకున్నారు. చాలా కాలం తర్వాత పార్టీకి పూర్వ వైభవం సంతరించుకున్న నేపథ్యంలో లాలూ మంచి ఉత్సాహంగా ఉన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles