Pass marks are not 35 only 20

Pass marks are not 35 only 20

SSC, Pass marks, Telangana, Second language

If U get 35 marks in the exam u will pass but from next year pass marks are only 20. SSC board decided to cut pass marks in second lanuage.

35 కాదు 20 మార్కులకే పాస్

Posted: 11/10/2015 08:22 AM IST
Pass marks are not 35 only 20

పరీక్షలు అంటేనే స్టూడెంట్స్ కు నచ్చని విషయం. అయితే అందరూ ఏదోలా ఆ స్టేజ్ ను దాటి వచ్చే వాళ్లు. కాగా చాలా మంది పాస్ మార్కుల కోసం చాలా కష్టపడుతుంటారు. పాస్ మార్కులు 35 కోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే ఇక మీదట 35 కోసం కాకుండా 20 కోసం కష్టపడితే చాలు. పరీక్షలో 35 వస్తే పాస్ అన్న నిబంధనను సవరించి.. 20 కే పాస్ అంటూ తాజాగా కొత్త మార్పులు తీసుకువచ్చారు. అయితే పాస్ మార్కులు 35 నుండి 20 కి తగ్గాయంటే సంబర పడుతున్నారేమో కానీ ఇక్కడ కూడా కండీషన్స్ అప్లై అన్నట్లుంది. ఎందుకంటే ఇది కేవలం పదో తరగతి పరీక్షల్లో.. అది కూడా ఒక సబ్జెక్టుకు మాత్రమే.

పదో తరగతి వార్షిక పరీక్షల్లో సెకండ్ ల్యాంగ్వేజ్ పాస్‌ మార్కులపై గందర గోళం నెలకొన్నది. గతేడాది పబ్లిక్‌ పరీక్షల్లో ద్వితీయ భాష హిందీలో 35 మార్కులు సాధించాలని విద్యాశాఖ నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. నిరంతర సమగ్ర మాల్యాంకనాన్ని గతేడాదే ప్రారంభించటంతో హిందీలో మిగితా సబ్జెక్టుల్లా కాకుండా పాస్‌ మార్కులు 20గా నిర్ణయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో పాస్‌ మార్కులను 35 నుంచి 20కి తగ్గిస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థులంతూ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి చాలా మంది స్టూడెంట్స్ కు చుక్కలు చూపించిన సెకండ్ ల్యాంగ్వేజ్ పాస్ మార్కులు 20 కి తగ్గడం చాలా మందికి ఆనందం కలిగిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SSC  Pass marks  Telangana  Second language  

Other Articles