Barack Obama to declare Diwali

Barack obama to declare diwali

Diwali, America, Holiday, US, Obama, Hindu Festival, Hindu people Diwali

Inspired by the sudden love for and deep understanding of preachings of Mahatma Gandhi, U.S. President Barack Obama has today decided to declare Diwali (a religious festival of Hindus) and Eid ( a religious festival of Muslims) as National Holidays across all Universities and government offices in United States.

ITEMVIDEOS: అమెరికాలో దీపావళి సెలవు

Posted: 11/09/2015 01:40 PM IST
Barack obama to declare diwali

ప్రముఖ హిందూ పండగ దీపావళి నాడు అందరూ ఎంతో సంతోషంగా వేడుక చేసుకుంటారు. ముఖ్యంగా హిందువులు ఎక్కువగా నివసించే దేశాల్లో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతాయి. తమ జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని.. అజ్ఞానం తమ జివితాల నుండి తొలగిపోవాలని కోరుకుంటూ దీపావళిని ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే భారత్ సహా కొన్ని దేశాల్లో మాత్రమే దీపావళి నాడు ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించాయి. తాజాగా అమెరికాలో కూడా దీసావళి నాడు సెలవు దినంగా ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈమేరకు దీపావళి సెలవు ప్రకటిస్తూ అధికారికంగా ఉత్తర్వుల మీద సంతకం కూడా చేశారు.

అమెరికాలో ఉన్న అందరూ కూడా దీపావళి వేడుకలను చేసుకోవాలని.. అందరి ఇళ్లు కొత్త వెలుగులతో నిండిపోవాలని బరాక్ ఒబామా ఆకాంక్షించారు. అమెరికాలో హిందువులు, బౌద్దులు, జైనులు ఉన్నారని వారు కూడా దీపావళి నాడు ఇంట్లో దీపాలు వెలిగించడం ద్వారా పండగను చేసుకోవాలని అన్నారు. ప్రజలందరికి ఒబామా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Diwali  America  Holiday  US  Obama  Hindu Festival  Hindu people Diwali  

Other Articles