anant kumar singh won bihar elections as mla from mokama who is in the jail in different cases | bihar elections

Anant kumar singh won bihar elections as mla in mokama

anant kumar singh, chote sarkar, bihar bahubali, bihar elections, mokama division elections, bihar elections controversy, jdu won bihar elections

anant kumar singh won bihar elections as mla in mokama : anant kumar singh won bihar elections as mla from mokama who is in the jail in different cases.

బీహార్ ఎన్నికల్లో జైల్లో నుంచే గెలిచిన ‘బాహుబలి’

Posted: 11/09/2015 01:12 PM IST
Anant kumar singh won bihar elections as mla in mokama

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపిన బీహార్ ఎన్నికల్లో ఎట్టకేలకు మహాకూటమి ఘనవిజయం సాధించి, మోదీ ప్రభుత్వానికి నిరాశే మిగిల్చింది. అప్పటిదాకా ఈ ఎలక్షన్స్ లో మోదీయే గెలుస్తాడని అంతా ఊహించారు కానీ.. ఫలితాలు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఆ విషయం అలావుంచితే.. ఈ ఎన్నికల్లో మరో విశేషమైన విషయం చోటు చేసుకుంది. కిడ్నాప్, హత్యలు, అత్యాచారాలు వంటి నేరారోపణలతో జైల్లో మగ్గుతున్న జేడీయూ మాజీ అనంత కుమార్ సింగ్ (బాహుబలి) అఖండ విజయం సాధించి, తన సట్టా చాటాడు. మరోసారి తాను నిజమైన ‘బాహుబలి’గా పేరుగాంచాడు.

ఒకప్పుడు జేడీయూ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి పలు నేరారోపణల కారణంగా జైలుకు వెళ్లి ఆ పార్టీని వదిలేసిన అనంత సింగ్(బాహుబలి) అలియాస్ చోటే సర్కార్ తిరిగి మరోసారి తన సత్తా చాటాడు. ఒక్కరోజు కూడా ప్రచారంలో పాల్గొనకుండా జైలు ఉండే తన హవా చూపించి, అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. తిరిగి అదే జేడీయూ పార్టీకి చెందిన అభ్యర్థిని మట్టికరిపించాడు. గతంలో 2005, 2010లో జేడీయూ టికెట్ పై అనంత సింగ్ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే కిడ్నాప్, హత్యలు, అత్యాచారాల కేసులో జైలు పాలయ్యాడు. దీంతో అతడు పార్టీని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత అతడిని చాలా నెలలుగా జైలులోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి ఎన్నికలు రావడంతో తిరిగి వచ్చాయి.

దీంతో తన సత్తా చాటుకునే సమయం మరోసారి వచ్చిందని భావించిన బాహుబలి.. ఒకప్పుడు తాను బరిలోకి దిగిన మోకామా నంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఇదే స్థానంలో జేడీయూ తరుఫున బరిలో నిలిచిన జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్కు ఓటమి రుచి చూపించాడు. మొత్తం 18,348 ఓట్ల మెజారిటీతో నెగ్గాడు. మొత్తం ఓట్లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అనంత కుమార్ సింగ్ కు 54,005 ఓట్లు పోలవ్వగా.. జేడీయూ అభ్యర్థి నీరజ్ కుమార్ కు 35,657 ఓట్లు లభించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anant kumar singh  chote sarkar  bihar bahubali  bihar elections  

Other Articles