Bihar polls result will have national implications, says Nitish Kumar

People have rejected attempts at polarising society nitish kumar

bihar election results, bihar elections, bihar election 2015, rahil gandhi, mamata banerjee, shivasena, kcr, naveen patnaik, chandrababu, bihar election results 2015, bihar live election results, bihar election news, election news, RJD, JDU, congress, BJP, nitish kumar, lalu prasad yadav, sonia gandhi, pm Modi, amit shah, sharad yadav, ram vilas paswan, jitin ram manghi

As leaders of the Grand Alliance celebrated their win, the chief minister said the government will work towards fulfilling the aspirations of the people.

ఇది ప్రజా విజయం.. ప్రతిపక్షాలను గౌరవిస్తాం.. నితీష్

Posted: 11/08/2015 06:20 PM IST
People have rejected attempts at polarising society nitish kumar

బిహార్ ఎన్నికల్లో మహాకూటమికి అధికారం అప్పగించినందుకు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అభినందనలు తెలిపారు. మహాకూటమికి గట్టి మద్దతు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారు కాబట్టే ఈ ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి భారీ మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో మిత్రపక్షం ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌తో నితీశ్‌కుమార్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పటిష్టమైన ప్రతిపక్షం ఉంటేనే పరిపాలన సజావుగా ఉంటుందని, రాష్ట్రంలో తాము ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు. బిహార్ అభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి చేయాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇది ప్రజల విజయం, మహాకూటమి విజయం అని పేర్కొన్నారు.

*    ఇది బిహార్ స్వాభిమానం విజయం
*    మహాకూటమిని బీహార్ ఓటరు అదరించడం వల్లే మీముందు మళ్లీ నిలబడ్డాం
*    ఎవరికి ఓటు వేయాలన్నది ఓటర్లు ముందుగానే నిర్ణయించుకున్నారు అందుకే ఈ ఫలితాలు
*    అన్ని వర్గాల..నుంచి మద్దతు లభించింది. ముఖ్యంగా మహిళలు, యువత మద్దు అందింది
*    మహాకూటమికి గట్టి మద్దతు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు
*    ఎన్నికల సమయంలో చాలా దారుణమైన ప్రచారం జరిగింది
*    బిహార్ ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోకుండా తమ విజ్ఞత నిరూపించుకున్నారు
*    ఇది చాలా పెద్ద విజయం. దీన్ని మేం వినమ్రంగా స్వీకరిస్తున్నాం
*    బిహార్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, వేగంగా వెళ్లాలని ప్రజలు భావిస్తున్నారు
*    మేమంతా దాన్ని అర్థం చేసుకుంటున్నాం. ప్రజల ఆశలకు అనుగుణంగానే పనిచేస్తాం
*    మా కూటమిని ప్రజలు ఆమోదించారు. ఈ మాండేట్ ప్రకారమే మేం పనిచేస్తాం
*    మా మనసులో బిహార్లో ఎవరిపట్లా ఎలాంటి విభేదాలు ఉండవు
*    పాజిటివ్ భావనతోనే మేం పనిచేస్తాం
*    పటిష్ఠమైన ప్రతిపక్షం ఉంటేనే పాలన బాగా సాగుతుంది
*    బిహార్లో ఫలితాలు బాగా వస్తే, దీని ప్రభావం దేశం మొత్తమ్మీద ఉంటుంది
*    ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అధికారం ఇచ్చిన తర్వాత ప్రతిపక్షం బలహీనంగా ఉండాలని ఎవరూ అనుకోరు
*    మేం ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తాం, ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నాం
*    ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీరేలా పాలన సాగిస్తాం
*    ప్రధానమంత్రి కూడా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు
*    కేంద్రం కూడా బిహార్ అభివృద్ధికి సహకరిస్తుందని ఆశిస్తున్నాం
*    సోనియా, రాహుల్ గాంధీ, సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందించారు.. వాళ్లకు కృతజ్ఞతలు.
*    ట్విట్టర్ ద్వారా కూడా అభినందనలు తెలిపినవాళ్లకు సైతం కృతజ్ఞతలు.
*    మొదటి నుంచి మేమంతా ఒకే మాటమీద ఉన్నాం, ఎలాంటి వివాదాలకు తావివ్వలేదు
*    ఏ సీట్లో ఏ పార్టీ పోటీ చేయాలో కూడా ముందే నిర్ణయించుకున్నాం. మూడు పార్టీల అభ్యర్థులందరి పేర్లు కలిపి ఒకేసారి ప్రకటించాం
*    సమాజంలో విభేదాలు తేవాలన్న ప్రయత్నాలు కొంతవరకు జరిగినా, అవన్నీ విఫలమయ్యాయి

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar election results  PM modi  rahul gandhi  nitish kumar  lalu prasad yadav  congress  

Other Articles