CM of different states congratulate Nitish Kumar

Kcr naidu mamata banerjee naveen patnaik greet nitish kumar

bihar election results, bihar elections, bihar election 2015, rahul gandhi, mamata banerjee, shivasena, TRS kavitha, KCR, chandrababu, bihar election results 2015, bihar live election results, bihar election news, election news, RJD, JDU, congress, BJP, nitish kumar, lalu prasad yadav, sonia gandhi, pm Modi, amit shah, sharad yadav, ram vilas paswan, jitin ram manghi,

Chief ministers of various states congratulate grand alliance leaders Nitish Kumar, lalu prasad yadav for land slide victory in bihar elections

నితీష్, లాలులకు అభినందనల వెల్లువ.. బాబు, కేసీఆర్, పట్నాయక్, మమత కూడా..

Posted: 11/08/2015 06:59 PM IST
Kcr naidu mamata banerjee naveen patnaik greet nitish kumar

బీహార్ లో మూడింట రెండొంతుల మెజారిటీని సాధించిన మహా కూటమికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడులు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నితీష్ విజయంపై ఆయనను అభినందించారు. అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నందుకే నితీశ్ - లాలూ కూటమి ఘన విజయం సాధించిందని కేసీఆర్ ప్రశంసించారు. అటు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా నితీష్ కుమార్ కు శుభాకాంక్షలు చెప్పారు.

మరోవైపు బీహార్ లో మహా కూటమి విజయంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేగంగా స్పందించారు. బీహార్ ఎన్నికలపై మీడియాతో మాట్లాడిన ఆమె ఈ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే సహనం విజయం సాధించగా, అసహనం ఓటమి పాలైందని ఆమె వ్యాఖ్యానించారు. ఉమ్మడిగా విజయం సాధించిన నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లకే కాక మహా కూటమికి విజయం కట్టబెట్టిన బీహార్ ప్రజలకు దీదీ శుభాకాంక్షలు తెలిపారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన మిత్రపక్షం బీజేపీని దెప్పిపొడుస్తూ శివసేన వ్యాఖ్యలు చేసింది. ఈ ఓటమికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యత వహించాలని పేర్కొంది. అదేసమయంలో బిహార్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నితీశ్‌కుమార్‌ను నిజమైన హీరోగా పేర్కొంటూ శివసేన ప్రశంసల్లో ముంచెత్తింది. కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతే అది సోనియాగాంధీ బాధ్యత అవుతుంది. అదేవిధంగా బిహార్ ఫలితాలను ప్రధాని మోదీ బాధ్యతగా బీజేపీ తప్పక అంగీకరించాలి' అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ పేర్కొన్నారు. 'ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు వచ్చినా ఫలితాలు ఇదేవిధంగా ఉంటాయి. ఎన్నికలకు మేం భయపడటం లేదు' అని ఆయన అన్నారు. రాజకీయ హీరోగా అవతరించిన నితీశ్‌కుమార్‌కు తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అభినందనలు తెలిపారని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar election results  mamata banerjee  shivasena  KCR  chandrababu  

Other Articles