Negative statements by BJP leaders worked against NDA: Sharad Yadav

Victory of principles over moneybags sharad yadav

bihar election results, sharad yadav, bihar elections, bihar election 2015, live bihar election, live election results, 2015 election results, bihar election results 2015, bihar live election results, bihar election news, election news

JD(U) chief Sharad Yadav described it as a "victory of principles over moneybags", asserting that the Nitish Kumar-led grouping will win close to 150 seats.

మహాకూటమి 150 సీట్లకు పైగానే సాధిస్తుంది

Posted: 11/08/2015 02:48 PM IST
Victory of principles over moneybags sharad yadav

బిహార్ ఎన్నికలలో డబ్బు సంచులపై.. సిద్దాంతాలే విజయం సాధించాయని జనతా దళ్ (యునైటెడ్) అధ్యక్షుడు శరద్ యాదవ్ పేర్కోన్నారు. అభివృద్దిని కాంక్షించే బీహార్ ఓటరు నిజమైన నాయకుడినే ఎన్నుకున్నారని ఆయన అన్నారు. తమ కూటమిని మరోమారు అధికారంలోకి తీసుకువచ్చిన బీహార్ ఓటరు మహాశయులకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రస్తుత లీడింగ్ చూస్తుంటే మహాకూటమి 150 స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ఆదివారమిక్కడ అన్నారు.
 
పార్టీ విజయం కోసం శ్రమించిన కూటమి నేతలు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లను ఆయన అభినందించారు. హ్యాట్రిక్ విజయాన్ని అందించిన పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు ఆయన శుభాకాంక్షఃలు తెలిపారు. బీజేపి వ్యతిరేక ప్రచారాలు, వివాదాస్పద వ్యాక్యలు కూడా ఎన్డీయే ఓటమికి కారణమయ్యాయని ఆయన శరద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఓట్ల లెక్కింపులో ముందు ఎన్డీయే కూటమి ఆధిక్యం కొనసాగగా... ఆ తర్వాత మహాకూటమి పుంజుకుంది.  మరోవైపు  మహాకూటమి రేసులో ముందు ఉండటంతో  పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మిఠాయిల పంచుకుని, పఠాసులు కాల్చుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar elections 2015  sharad yadav  nitish versus modi  lalu prasad  

Other Articles