PM Modi Tweets Birthday Wishes to LK Advani, Calls Him 'Best Teacher'

Pm modi wishes lk advani a happy birthday

l k advani, narendra modi, advani birthday, modi greets advani, modi meets advani, l k advani birthday, nation news

BJP patriarch L K Advani was born on November 8, 1927 in Karachi in Pakistan

88వ పడిలోకి బీజేపి కురువృద్దుడు.. అద్వానీకి మోడీ శుభాకాంక్షలు

Posted: 11/08/2015 01:13 PM IST
Pm modi wishes lk advani a happy birthday

బీజేపి పార్టీ కురువృద్దుడు, సినియర్ నేత, మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అధ్వానీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్రమోడీ, అద్వాని నివాసానికి వెళ్లి పుష్పాగుచ్చాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అద్వానీకి ఆయన మనస్పూర్తాగా నమస్కరించి మరీ శుభాకాంక్షలను వ్యక్తపర్చారు. తన నివాసానికి వచ్చిన మోదీకి అద్వానీ సాదర స్వాగతం పలికారు. బీజేపి కురువృద్దుడు అద్వానీ ఇవాళ 88వ పడిలోకి ప్రవేశించారు.

అద్వానీ నివాసానికి వెళ్లకముందే ఆయనకు ట్విట్టర్ ద్వారానూ బర్త్ డే విషెస్ తెలిపారు మోదీ. అద్వానీ అత్యంత గౌరవనీయులని, మార్గదర్శిగా, ఉత్తేజాన్నిచ్చిన స్పూర్తి ప్రధాతగా నిలుస్తారని పేర్కొన్న మోదీ.. పెద్దాయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాననన్నారు. అపారమైన జ్ఞానసంపత్తి, రుజువర్తన అద్వానీ సొంతమని కొనియాడారు. వ్యక్తిగతంగా అద్వానీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, తన జీవితంలో అత్యుత్తమ గురువు ఆయనేనని చెప్పుకొచ్చారు.మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్.కె. అద్వానీ 1927, నవంబర్ 8న ప్రస్తుత పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించారు. విభజన అనంతరం భారత్ కు వచ్చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prime Minister Modi  greets  L K Advani  birthday  

Other Articles