Govt may levy 2% charge on flight tickets from January

Airfares in new year to cost more as government levies 2 percent cess

air tickets to be costlier in india, levy tax to be imposed on air tickets, flight ticket fare, flight fare surcharge, flight fare, flight ticket, india news, latest news

The civil aviation ministry is looking at levying a charge of 2 per cent on all domestic and international flight tickets sold within the country.

విమానయాన ధరలకు రెక్కలు.. మధ్యతరగతి ప్రజల తీరని కలలు

Posted: 11/07/2015 06:18 PM IST
Airfares in new year to cost more as government levies 2 percent cess

జీవితకాలంలో ఒక్కసారైనా విమానం ఎక్కి ప్రయాణం చేయాలని మద్య తరగతి ప్రజలు కలలు కంటుంటారు. అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి మధ్యతరగతి ప్రజలక కలలు ఇక కలలు గానే వుంటే అవకాశం వుంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకునే పలు చర్యల కారణంగా, మధ్య తరగతి ప్రజలకు విమానాలు ఇక దూరం కానున్నాయి. ఒక్క సారైనా విమానయానం చేయాలన్న వారి ఆశలు అడియాశలుగానే మిగలనున్నాయి. దీనికి కారణం విమానయాన ధరలకు రెక్కలు త్వరలో రానున్నాయి.

దేశీయంగా వివిధ నగరాల మధ్య, పలు రూట్ లలో ప్రయాణించేవారితో పాటు, విదేశీ ప్రయాణికులు జనవరి 2016 నుంచి తమ తమ విమాన టికెట్లపై మరింత డబ్బును అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త ఏవియేషన్ పాలసీ అమలైతే విమాన టికెట్లపై 2 శాతం లెవీ పడనుంది. చిన్న చిన్న పట్టణాల మధ్య విమానాల కనెక్టివిటీ పెంచాలని భావిస్తున్న మోదీ ప్రభుత్వం టికెట్ ధరలపై సుంకాలను పెంచి సాలీనా రూ. 1,500 కోట్లను ఖజానాకు చేర్చాలని భావిస్తోంది.

ఈ నిధులతో చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలన్నది మోదీ ఆలోచన. సవరించిన జాతీయ విమానయాన విధానానికి క్యాబినెట్ ఆమోదం పలికితే, తక్కువ ధర ప్రయాణాలు, ఆఫర్లు తగ్గుతాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో ఏప్రిల్ 1 నుంచి గంట పాటు గాల్లో ఎగిరే విమానంలో గరిష్ఠంగా టికెట్ ధర రూ. 2,500గా ఉండాలని విమానయాన సంస్థలు కేంద్ర విమానాయాన మంత్రిత్వశాఖపై ఒత్తడి తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశారు. దీంతో మధ్యతరగతి ప్రజలకు విమానాయానానికి దూరం కానున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : flight fare  surcharge  2% levy charge  air ticket charges  

Other Articles