Kaikaluru police files case against Chintamaneni Prabhakar

After attack on mro now chintamaneni attacks forest officials

chintamaneni prabhakar, TDP MLA, kaikaluru police, denduluru mla, kaikaluru police files case against mla chintamaneni, TDP mla chintamaneni attacks forest officials

After attack on Mro, now denduluru TDP mla chintamaneni attacks forest officials, kaikaluru police files case against him

చింతమనేనికి మళ్లీ కోపం వచ్చింది..! టార్గెట్ అటవీశాఖ అధికారులు

Posted: 11/07/2015 01:10 PM IST
After attack on mro now chintamaneni attacks forest officials

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన నిరంకుశత్వాన్నికి అడ్డువచ్చారన్న అక్కస్సుతో అధికారులపై మరోమారు దాడికి పాల్పడ్డారు. అధికార ఎమ్మెల్యే ముసుగులో ఆయన అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను అడ్డుకునేందుకు యత్నిస్తున్న అధికారుల ఆయన అనుయాయువుల దాడిలో గాయపడుతున్నారు. అధికారం చేతిలో వుందని ఆయన సల్పుతున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలు బహిర్గతమయ్యాయి.

తాజాగా కొల్లేరు నిషేధిత ప్రాంతమైన ఆటపాక - కోమటిలంక మధ్య శుక్రవారం రాత్రికి రాత్రే రోడ్డు రోడ్డు వేసేందుకు వారు ప్రయత్నించారు. ఆ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అయితే వారిపై చింతమనేనితోపాటు ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ...అవసరం అయితే తనపై కేసు పెట్టుకో అంటూ బెదిరింపులకు దిగి రోడ్డు నిర్మించారు. దాంతో అటవీశాఖ డిప్యూటీ రేంజర్ ఈశ్వరరావు గతరాత్రి కైకలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే చింతమనేనితోపాటు 60మంది అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో రోడ్డు వేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అయితే అప్పుడు అటవీ శాఖ అధికారులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సదరు ప్రాంతంలో పక్షుల కేంద్రం ఉందని... ఈ నేపథ్యంలో రోడ్డు వేయవద్దంటూ అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసిందే. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ కృష్ణాజిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలను, రవాణాను అడ్డుకున్న ముసునూరు మహిళా ఎమ్మార్వో డి. వనజాక్షిపై దాడి చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chintamaneni prabhakar  TDP MLA  kaikaluru police  

Other Articles