Who is the king of Bihar

Who is the king of bihar

Bihar, Elections, Bihar exit polls, Bihar polls, Bihar Elections, Bihar results

The politically crucial Bihar election looks headed for a tight finish with exit polls divided over what the final outcome will be when votes are counted on Sunday. One gave a clear majority to the Bharatiya Janata Party-led National Democratic Alliance while two predicted a victory for the Nitish Kumar-headed grouping of the Rashtriya Janata Dal, Janata Dal (United) and Congress. Three of them suggested that the numbers may be evenly matched.

రాజా.. బీహార్ కింగ్ ఎవరు రాజా..?

Posted: 11/07/2015 12:50 PM IST
Who is the king of bihar

బీహార్ లో పలానా పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఊదరగొడుతున్నాయి. మరి నిజానికి ఓటరు ఎవరికి పట్టం గట్టారు అన్నది ఎవరికీ అర్థం కాని విధంగా ఉంది. బీహార్ ఎన్నికల బరిలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షానికి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడింది. మహాకూటమిలో జెడియు, ఆర్జేడీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు అన్నీ ఏకమయ్యాయి. బిజెపి పార్టీని ఓడించే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచిన నితీష్ కుమార్ వర్గం దాదాపు గెలుస్తుందని చాలా సర్వేలు వెల్లడించాయి. దేశంలో గత కొంత కాలంగా నడుస్తున్న గోమాంసం వివాదం వల్ల ఎన్డీయే క ఓట్లు తగ్గాయని ఆ సర్వేలు వెల్లడించాయి. దాదాపు మహాకూటమి 120 నుండి 125 సీట్లు, ఎన్డీయే పక్షానికి 110 నుండి 115 సీట్లు వస్తాయని సర్వేలు అభిప్రాయపడ్డాయి. అయితే కొన్ని మాత్రం దీన్ని వ్యతిరేకించాయి.

దేశంలో టాప్ మోస్ట్ ఛానల్ గా పేరున్న ఎన్డీటీవీ మాత్రం ఎన్డీయే పక్షానికే అధికారం దక్కుతుందని అబిప్రాయం వ్యక్తం చేసింది. బిజెపి కూటమికి 120 నుండి 130 సీట్లు వస్తాయని.. అలాగే జెడియు, ఆర్జేడీలతో కూడిన మహాకూటమికి కేవలం 105 నుండి 115 సీట్లు మాత్రమే వస్తాయని అభిప్రాయపడింది. ఏకపక్షంగా ప్రజలు ఎన్డీయే కూటమికి అధికారాన్ని అప్పగిస్తున్నారని ఎన్డీటీవీ తన సర్వేలో వివరించింది. మరి కొన్ని చానల్స్ ఏమో మహా కూటమికి విజయావకాశాలున్నాయని అంటుంటే.. మరి కొన్ని ఛానల్స్ ఏమో ఎన్డీయే కూటమికి విజయావకాశాలున్నాయిని అంటున్నాయి. మరి బీహార్ కింగ్ ఎవరు అన్నది మాత్రం ఆదివారం నాటి ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Elections  Bihar exit polls  Bihar polls  Bihar Elections  Bihar results  

Other Articles