Dawood and Shakeel wanted to surrender

Dawood and shakeel wanted to surrender

Dawood, Shakeel, Mumbai, Chhota Rajan, Bali, Dawood Ibrahim, House Arrest

In a startling revelation, underworld don Dawood Ibrahim's former lawyer has said that Dawood wanted to surrender to Indian authorities but had set the same conditions as Chhota Rajan. 'When Dawood wanted to surrender he had also asked for the same conditions which Rajan has asked now', said Shyam Keswani, the former lawyer of Dawood. Referring to a previous statement of India's top lawyer Ram Jethmalani, he said 'as Jethmalani claimed Dawood & Shakeel wanted to surrender only if they are not lodged in Arthur road jail'.

దావూద్, షకీల్ కూడా లొంగిపోతారట..!

Posted: 11/07/2015 10:08 AM IST
Dawood and shakeel wanted to surrender

ముంబై మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ కూడా లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నారట. అయితే వారు కొన్ని నిబంధనలు పెట్టినట్లు సమాచారం. మొన్న బాలీలో ఛోటా రాజన్ అరెస్టు తర్వాత దేశంలో సంచలనం రేపింది. అయితే సిబిఐ అధికారులు ఛోటా రాజన్ ను దిల్లీకి తరలించారు. కాగా ఛోటా రాజన్ ను ఏ జైలుకు పంపించాలి అన్న దాని మీద సందిగ్దత నెలకొంది. అయితే దేశంలోని దాదాపు అన్ని జైల్లలో దావూద్ ఇబ్రహీం అనుచరులు ఉండటంతో.. అతడి ప్రాణానికి ముప్పు ఉందని భ్రదతాధికారులు అనుమానించారు. దాంతో ఛోటా రాజన్ ను హౌజ్ అరెస్టు చెయ్యడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే తనకు కూడా అదే ఫెసిలిటి కావాలని దావూద్ అంటున్నారట.

ముంబై మాఫియాకు మకుటం లేని రారాజుగా మారిన దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముంబై పోలీసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. క్రైం సిటీగా మార్చిన దావూద్ గతంలొ లొంగపోతనని వచ్చినా కానీ నాటి ముఖ్యమంత్రి షరత్ పవార్ కండీషన్స్ కు ఒప్పుకోలేదని తెలుస్తోంది. రాంజెఠ్మలానీ దావూద్ ఇబ్రహీం లొంగిపోతాడని.. కానీ జైల్ లో పెట్టకుండా ఉంటాను అంటే మాత్రమే అని కండీషన్ పెట్టాడట. కానీ శరత్ పవార్ మాత్రం చట్టం అందరికీ చట్టమే కాబట్టి జైల్ కు వెళ్లకతప్పదు అని వెల్లడించారట. అయితే తాజాగా ఛోటా రాజన్ అరెస్ట్ తర్వాత మరోసారి దావూద్ ఇబ్రహీం అరెస్ట్ వ్యవహారం మీద చర్చ సాగుతోంది. దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ కూడా జైల్ లో కాకుండా హౌజ్ అరెస్ట్ అవకాశం కల్పిస్తే లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు వార్త వస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dawood  Shakeel  Mumbai  Chhota Rajan  Bali  Dawood Ibrahim  House Arrest  

Other Articles