the biggest start up incubator T hub inaugurated

The biggest start up incubator t hub inaugurated

T Hub, India, IT, Start ups, start up incubator, Ratan tata, Hyderabad, the start-up incubator of Telangana, Gachibowli, Narasimhan

Tata Sons Chairman Emeritus Ratan Tata and Governor ESL Narasimhan inaugurated the first phase of T-Hub, the start-up incubator of Telangana. The incubator, the largest in the country for start-ups, is located at the International Institute for Information Technology (IIIT) at Gachibowli, and offers 70,000 sq feet area with infrastructure to start-ups willing to pay a fee to use the facility.

ఐటీలో మరోశకం.. టీహబ్

Posted: 11/06/2015 08:22 AM IST
The biggest start up incubator t hub inaugurated

భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన బెంగళూరు సిటీకి పోటీగా తెలంగాణ సర్కార్ టీహబ్ ను ప్రారంభించింది. ఇప్సటికే ఐటీ రంగంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మరో మైలురాయిని అదిగమించింది. తాజాగా టీహబ్ ను అన్ని రకాల హంగులు, సౌకర్యాలతో ఏర్సాటు చేసింది తెలంగాణ ఐటీ మంత్రిత్వ శాఖ.హైదరాబాద్‌లోని ఐఐఐటీ క్యాంపస్‌లో టీ హబ్‌ను రతన్‌టాటా, గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహాన్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు లాంఛనంగా ప్రారంభించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్త ప్రయోగాల ద్వారా పారిశ్రామిక రంగంలో కొత్త పుంతలు తొక్కాలని రతన్ టాటా కోరారు.

వ్యవసాయం, బయో టెక్నాలజీ, జీవశాస్త్ర రంగాల్లో స్టార్టప్‌లు రావాల్సిన అవసరముందని రతన్ టాటా వెల్లడించారు. ప్రపంచంలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ఎప్పటి నుంచో ఉందన్నారు. అమెరికా లాంటి దేశాల్లో 1980వ సంవత్సరంలో ఉందన్నారు. ఈ దేశాల్లో ఐటీ, కమ్యూనికేషన్‌, మొబైల్‌ రంగాలను అప్పటి నుంచి వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత పెరిగిందన్నారు. దీని ప్రభావం భవిష్యత్‌లో కొత్త భారతదేశానికి అవసరమని తెలిపారు. భవిష్యత్‌ భారత దేశానికి తమ సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. మరిన్ని కొత్త పరిశ్రమలకు ఊతమిస్తుందన్నారు. జీ+5 అంతస్థులతో విస్తరించిన ఉన్న కాటలిస్ట్ భవంతిని ఆసాంతం కలియతిరిగి చూసిన టాటా ముగ్ధులయ్యారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో, యూత్ మెచ్చే ఇంటిరీయర్ డిజైన్లతో తీర్చిదిద్దారని, ఎనర్జీ ఎఫిషియంట్ భవంతిగా తీర్చిదిద్దడం అద్భుతమని కితాబిచ్చారు. సొంత కేబిన్‌లు, డెస్క్ స్పేస్ కేటాయించిన తీరు కూడా బాగుందన్నారు. టీ హబ్‌లో ఏర్పాటు చేసిన తన చిత్రపటంపై టాటా ఆటోగ్రాఫ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles