Underworld don Chhota Rajan brought to Delhi from Indonesia

Underworld don chhota rajan brought to delhi from indonesia

chhota Rajan, India, Don, Mumbai, Dawood, Underworld don

Underworld don Chhota Rajan was brought to Delhi early this morning from Indonesia by a joint team headed by CBI officials for facing trial in various criminal cases registered against him in Delhi and Mumbai.

ITEMVIDEOS: దిల్లీకి చేరిన ఛోటా రాజన్

Posted: 11/06/2015 08:10 AM IST
Underworld don chhota rajan brought to delhi from indonesia

మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ ను ఇండియాకు తీసుకువచ్చారు. ఈ ఉదయం ఆరు గంటలకు దిల్లీ ఎయిర్ పోర్ట్ కు ఛోటా రాజన్ ను సిబిఐ అధికారులు పూర్తి బందోబస్తుతో తీసుకువచ్చారు. బాలి నుంచి సీబీఐ బృందం తీసుకువచ్చింది. 27 ఏండ్ల తర్వాత అతను భారత్‌లో అడుగుపెట్టాడు. బాలిలో ఉన్న భారత సీబీఐ, పోలీసు బృందం చోటారాజన్‌ను భారత్ తీసుకువచ్చేందుకు బాగా కష్టపడ్డారు. భారత్ లో ఛోటా రాజన్ మీదున్న కేసుల వివరాలను అక్కడి పోలీస్ అధికారులకు అందించి.. వారిని ఒప్పించగలిగారు.

ఇప్పటికే చోటారాజన్‌పై నమోదైన కేసులన్నింటినీ మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. రాజన్ భారత్ బయల్దేరడంతో చీఫ్ సెక్రటరీ కేపీ బక్షి హుటాహుటిన మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అతనిపై ఉన్న కేసులను సీబీఐకి అప్పగిస్తున్నట్టు తెలిపారు. రాజన్‌కు సంబంధించిన కేసులను సీబీఐ విచారిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎస్ తెలిపారు. రాజన్‌ను ప్రశ్నించనున్న యూపీ పోలీసులు: భారత్ చేరుకున్నాక రాజన్‌ను పోలీసులు విచారిస్తారు. ముంబై, ఢిల్లీతోపాటు యూపీ పోలీసులు విచారిస్తారు. ఇటీవల ముగ్గురు క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు, చోటారాజన్ గ్యాంగ్‌తో వారికున్న సంబంధాలపై ఆరా తీయనున్నట్టు ఎస్టీఎఫ్ ఐజీ సుజిత్‌పాండే తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chhota Rajan  India  Don  Mumbai  Dawood  Underworld don  

Other Articles