hidden treasure at tiruvarur temple in two secret rooms

Treasure buzz at tiruvarur temple

Tiruvarur temple, Thiyagarajar temple, huge treasure, hidden treasure, Tiruvarur temple consecration, Tiruvarur temple consecration on November 8, veteran archaeologist, Kudavyil Balasubramanian, Asia's second largest charriot, Thiyagarajar sanctum sanctorum, secret rooms tiruvarur, tiruvarur Anantheswarar, inscriptions Tiruvarur temple

residents and researches have opined that a huge treasure might be hidden inside the Thiyagarajar temple in Tiruvarur.

అనంతుడి తరువాత మహాశివుడా..? కేరళ తరువాత తమిళనాడు..

Posted: 11/05/2015 04:09 PM IST
Treasure buzz at tiruvarur temple

కేరళలోని అనంత పద్మానభస్వామి తరువాత సంపన్నుడైన దేవం ఎవరూ అన్న ప్రశ్నకు ఇప్పడిప్పుడే సమాధానాలు వినబడుతున్నాయి. అనంతుడి తరువాత ఆ స్థానాన్ని లింగస్వరూపడైన మహాశివుడు అక్రమించనున్నాడా..? అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. తమిళనాడులోని తిరువారూర్‌ త్యాగరాజ ఆలయంలో కొలువైన మహాశివుడు కూడా సుసంపన్నుడే అంటున్నారు స్థానికులు. తాజాగా వార్తల్లోకి వచ్చిన తిరువారూర్ జిల్లాలోని త్యాగరాజస్వామి ఆలయంలో రెండు రహస్యగదులలో గుప్తనిధులున్నాయని స్థానికులు విశ్వసిస్తున్నారు.

స్థానికులు నమ్మకాలకు పురాతన శిలాఫలకాలు కూడా ఆధారాలుగా నిలుస్తున్నాయి. చారిత్రాత్మిక త్యాగరాజస్వామి ఆలయంలో వున్న రథం ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ రథం. దీనిని రూ.2.17 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ రథానికి గత అక్టోబర్‌ 2వ తేదీ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈనెల 8వ తేది ఆలయ కుంభాబిషేకం జరుగనుంది. ఈ నేపధ్యంలో ఆలయంలోని రెండు రహస్యగదులలో గుప్తనిధులున్నట్టు, ఆ గదులను కుంభాబిషేకానికి ముందుగా తెరచి చూడాలని భక్తులు విజ్ఞప్తిచేస్తున్నారు. దీనిపై పురావస్తు పరిశోధకులలో ఒకరైన గుడవాయిల్‌ డాక్టర్‌ బాలసుబ్రమణి మాట్లాడుతూ, తిరువారూర్‌ ఆలయంలో రెండు రహస్యగదులు వున్నాయనేది వాస్తమేనని, ఈ రెండుగదులలో విలువైన వస్తువులున్నట్లు శాసనాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thiyagarajar temple  huge treasure  secret rooms  Tiruvarur  inscriptions  

Other Articles