Mob beaten a school teacher

Mob beaten a school teacher

Karimnagar, Teacher, karimnagar Teacher beaten, Teacher beaten for harassing, Thimmapur

Mob beaten brutally a school teacher in Karimnagar. In Karimnagar, Thimmapur a school teacher misbehaving with students. Students already complaints to Head master.

ITEMVIDEOS: టీచర్ వెంటపడి చితకొట్టారు ఎందుకంటే..

Posted: 11/05/2015 01:29 PM IST
Mob beaten a school teacher

విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్ వెకిలి చేష్టలు చేస్తే ఎలా ఉంటుంది. తమకు ఏదో చదువు చెప్పి.. బాగు చేస్తాడని అనుకున్న టీచర్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది. తమ పిల్లలను బడికి పంపించి.. ఉన్నత చదువులు చదివిద్దామని అనుకున్న తల్లిదండ్రులకు.. తమ పిల్లలతో టీచర్ నీచంగా ప్రవర్తిస్తున్నాడని తెలిస్తే ఎలా ఉంటుంది. టీచర్ అనే పదానికి విలువ లేకుండా చేస్తూ.. కన్ను మిన్ను తెలియకుండా రెచ్చిపోతే ఎలా ఉంటుంది. ఇలా మొత్తం సీన్ కరీంనగర్ లో ఎదురైంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కు చెందిన ఓ స్కూల్లో చోటుచేసుకున్న ఘటన ఇది.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ప్రాధమిక ఉన్నత పాఠశాలలో ఓ టీచర్ నిర్వాకానికి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ను నడి వీధిలో ఉతికారేశారు. గత కొంత కాలంగా తమను వేధిస్తున్నాడని.. లైంగికంగా కూడా వేధింపులకు పాల్పడుతున్నాడని.. హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేసినా కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆ పాఠశాల విద్యార్థినులు తమ తల్లిదండ్రుల వద్ద తమ బాధను వెల్లడించారు. అయితే దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు స్కూల్ లో ఉన్న టీచర్ ను బయటకు లాగి.. రోడ్డు మీద దేహశుద్ది చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ కీచక టీచర్ ను వెంటనే అరెస్టు చేసి.. కేసు నమోదు చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karimnagar  Teacher  karimnagar Teacher beaten  Teacher beaten for harassing  Thimmapur  

Other Articles