Maggi Noodles Are Coming Back to India

Maggi noodles are coming back to india

maggi, noodles, India, Nestle, Lead, Lead content in Maggi, Nestle , sets , out plans , Maggi , comeback , in India

The instant-noodles brand was taken off shelves in June for allegedly containing high amounts of lead Nestlé will likely bring its popular brand of instant noodles back to Indian shelves within the next three weeks following a five-month ban, the company said

మళ్లీ మ్యాగీ నూడుల్స్ వచ్చేస్తున్నాయ్

Posted: 11/05/2015 10:35 AM IST
Maggi noodles are coming back to india

దేశంలో సంచలనంగా మారిన మ్యాగీ నూడిల్స్ మరోసారి జనాలకు చేరవవుతోంది. మ్యాగీ నూడిల్స్ లో లెడ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం మ్యాగీ అమ్మకాలను నిషేదించింది. అయితే తాజాగా మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ నెలాఖరు నుంచి మ్యాగీ అమ్మకాలు మొదలవుతాయని నెస్లే ఇండియా ప్రకటించింది. ప్రభుత్వ ల్యాబొరేటరీలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కొత్తగా ముద్రించిన ప్యాకెట్లను అమ్ముతున్నామని, లెడ్ పరిమాణం పరిమితులకు లోబడే ఉందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మ్యాగీలో సీసం పరిమాణం అధికంగా ఉందంటూ దేశవ్యాప్తంగా వచ్చిన ఆరోపణలతో వాటిని నిషేధించిన విషయం తెలిసిందే.

బాంబే హైకోర్టు చెప్పిన ప్రకారం నూడుల్స్‌ను తయారు చేయడంతో, ఇక వాటి అమ్మకాలకు నెస్లే సిద్ధమైంది. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామన్న నెస్లే ప్రతినిధులు, ఎక్కడెక్కడ నిషేధించారో ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి, వారి అనుమతితో అమ్మకాలు చేపడతామని వెల్లడించారు. అంతేకాదు భారత్ నుంచి ఎగుమతయ్యే మ్యాగీ నూడుల్స్ చాలా సురక్షితమని అమెరికా, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలు కూడా గుర్తించినట్టు నెస్లే ఇండియా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maggi  noodles  India  Nestle  Lead  Lead content in Maggi  Nestle  sets  out plans  Maggi  comeback  in India  

Other Articles