Cops behave like gundas

Cops behave like gundas

Police, Mumbai, Police beat couple, Andheri, ANdheri Police, Mumbai police, Police allegedly thrashed

A video clip purportedly showing a man and a woman being allegedly thrashed by policemen inside a police station has gone viral on social media, prompting senior officers to initiate a probe.The two, who work at a call centre in suburban Malad, were seen in the video being manhandled by some personnel inside the Andheri Police Station.

ITEMVIDEOS: పోలీసులే రౌడీల్లా కొట్టారు

Posted: 11/05/2015 09:34 AM IST
Cops behave like gundas

పోలీసులే కానీ డ్రస్సుకున్న విలువను మరిచారు.. పోలీసులే కానీ విచక్షణ మరిచారు.. అదే పోలీసులు కానీ లా అండ్ ఆర్డర్ మరిచిపోయారు. ముంబైలో ఓ యువ జంట మీద చేసిన దాడి. దానికి సంబందించిన వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దాంతో పోలీసుల వ్యవహార శైలి మీద దుమారం రేగుతోంది. పోలీసులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అంటూ సోషల్ మీడియాలో జాలు దుమ్మెత్తిపోశారు. పోలీసుల తీరుతో సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు పోలీస్ బాసులు రంగంలోకి దిగారు. జంట మీద చేయి చేసుకున్న పోలీసుల మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వారు వెల్లడించారు.

ముంబైలోని అంధేరిలో ఓ యువజంటను పోలీస్ స్టేషన్ లో పోలీసులు చితకబాదారు. రక్తం వస్తున్నా కూడా పట్టించుకోకుండా.. చితకొట్టారు. లేడీ కానిస్టేబుల్స్ అయితే అమ్మాయిని జట్టుపట్టి లాగి.. టేబుల్ మీద తల ఆన్చి.. బలం మేరకు కొట్టారు. అయితే వారిద్దరు బాగా తాగేసి ఉన్నారని.. రోడ్డు మీద కొట్టుకుంటుంటే వాళ్లను తీసుకువచ్చారని.. తర్వాత డ్యూటీ మాత్రమే చేశారని పోలీసులు వివరిస్తున్నారు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ గురించి స్టేషన్ కు తీసుకువచ్చారని.. వారు తాగి ఉన్నారని తిట్టి చివరకు చేయి చేసుకున్నారని సమాచారం. మొత్తానికి పోలీసుల తీరు ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. మరి అసలు నిజం ఏంటో విచారణలో తేలుతుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Mumbai  Police beat couple  Andheri  ANdheri Police  Mumbai police  Police allegedly thrashed  

Other Articles