Chinese Robot Breaks Guinness World Record for Walking

Chinese robot sets world record for walking

Chinese robot sets world record for walking, robots, xingzhe, chinese, 'walker, 1', robot, sets, guinness, world, record, for, distance, travelled, uk, tech, previous record, American robot, quadruped robot

A China-made quadruped robot Monday walked its way on to the pages of the Guinness World Records book for covering over 134-km in 54 hours, beating a previous record held by an American robot.

ITEMVIDEOS: అమెరికా రికార్డును బద్దలు కోట్టి.. తన పేరున రాసుకుంది..

Posted: 11/02/2015 08:34 PM IST
Chinese robot sets world record for walking

నడక మంచిదే.. శారీరక వ్యాయామంలో తోడ్పడుతుంది. అయితే అది మానవమాత్రులకు మాత్రమే కానీ రోబో (మరమనుషులకు) ఏమిటీ అవసరం అంటారేమో.. కానీ ఆ అవసరం రికార్డులను సోంతం చేసుకోవడానికే అంటే విశ్వసించగలారా..? అది కూడా ఎంతలా అంటే.. కేవలం 50 గంటల్లో ఏకంగా 134 కిలోమీటర్లు నడిచిన ఓ చైనా రోబో గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. గతంలో అమెరికా రోబో 30 గంటల్లో 65 కిలోమీటర్లు నడిచి గిన్నిస్‌లో చోటు సాధించగా.. ఆ రికార్డును చైనా రోబో బద్దలు కోట్టింది.

చైనాలోని చాంగ్‌క్వింగ్‌ యూనివర్సిటీ ఆఫ్ పోస్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌కు చెందిన పరిశోధకులు జంతువును పోలినవిధంగా నాలుగు కాళ్ల రోబోను తయారు చేశారు. దీనికి 'జింగ్‌ఝె నెంబర్ 1' అని పేరు పెట్టారు. ఈ రోబో గత నెల 24న సర్కిల్ ఇండోర్ ట్రాక్‌లో 134.03 కిలోమీటర్ల దూరాన్ని 54 గంటల సమయంలో  నడించింది. గంటకు 0.8 కిలోమీటర్ల వేగంతో ఈ దూరాన్ని అధిగమించిందని చైనా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ జిన్హుహా తెలిపింది. తద్వారా అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన 'రెంజర్' రోబో కన్నా రెండురెట్లు అధిక దూరాన్ని నడిచి.. 'జింగ్‌ఝె నెం.1' ఈ రికార్డు సాధించింది. ఈ రోబోను తయారీని ఏడాదిలోగా పూర్తిచేశామని చైనా పరిశోధకుడు ప్రొఫెసర్ లీ క్వింగ్‌డు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chinese Robot  Guinness World Record  Walking  

Other Articles