Telangana govt need some more time

Telangana govt need some more time

Telangana, GHMC, Elections, Hyderabad, Telangana Govt, Elections in Hyderabad, KCR, Voter cards, Polls in Hyderabad

Telangana govt requested to give more time to conduct GHMC elections. High court gave Dec.15 as last date to conduct elections. But Telangana govt requesting to give Jan15 as last date.

టైం కావాలంటున్న తెలంగాణ సర్కార్

Posted: 11/02/2015 12:16 PM IST
Telangana govt need some more time

తెలంగాణ ప్రభుత్వం హైకోర్ట్ ముందు మరింత టైం కావాలని కోరింది.. ప్రస్తుతం ఇచ్చిన టైం సరిపోవడం లేదు కాబట్టి ఇంకొంచెం టైం కావాలని కోర్ట్ కు విన్నవించుకుంది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు టైం కావాలని కోరుతోందని అన్న అనుమానం కలిగింది కదూ. గ్రేటర్ ఎన్నికల మీద మీన మేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం ఎంతకూ ఎలక్షన్ లను నిర్వహించడానికి ముందుకు రావడం లేదు. దాంతో ఎలక్షన్ ఎప్పుడు నిర్వహిస్తారు అంటూ హైకోర్ట్ తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. అయితే డిసెంబర్ 15 వరకు గడువు కూడా విధించింది. కానీ తాజాగా తెలంగాణ సర్కార్ తమకు మరికొంత టైం కావాటని కోరుతోంది.

వార్డుల విభజన, ఎలక్షన్ గుర్తింపు కార్డుల ఆధార్ కార్డ్ అనుసందానం వల్ల గ్రేటర్ ఎలక్షన్ ల నిర్వహణకు కాస్త లేట్ అవుతుందని కాబట్టి అంతకు ముందు కోర్ట్ ఇచ్చిన డిసెంబర్ 15 సరిపోదని తెలంగాణ సర్కార్ హైకోర్ట్ కు విన్నవించుకుంది. అందుకు గాను జనవరి 15 వరకు తమకు గడువు కావాలని కోరింది. అయితే గతంలో చాలా సార్లు ఇలా గడువు ఇస్తూనే వస్తున్నామని హైకోర్ట్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు నిర్వహించాలని ఉందా లేదా... అంటూ గతంలోనే తెలంగాణ సర్కార్ ను నిలదీసింది హైకోర్ట్. తాజాగా మరోసారి గడువు కోరుతున్న నేపధ్యంలో హైకోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles