‘Selfie with Modi’ bombed in Delhi polls, cost BJP Rs 1cr

Selfie with modi bombed in delhi polls

Selfies with PM Narendra Modi, ‘Selfie with Modi’ bombed in Delhi polls, bihar elections, Selfie with Modi, Delhi polls, cost Rs 1cr, BJP, PM Modi, Narendra Modi, Delhi assembly elections, Bihar assembly elections

Selfies with PM Narendra Modi have not paid much dividend to the BJP but has made a dent to the party's coffers. Seven rounds of 'Selfie with Modi' campaign during the Delhi assembly elections earlier this year cost the party Rs 1.06 crore.

కోటి వెచ్చించినా అక్కడ అచ్చిరాలేదు.. ఇక్కడ అసలు ఊసే లేదు..

Posted: 10/31/2015 09:23 PM IST
Selfie with modi bombed in delhi polls

సరిగ్గా ఏడాదిన్నర క్రితం దేశం మొత్తం మోడీ మానియాతో ఊగిపోయింది. ఆయనకు, ఆయన పార్టీకీ మూడు దశాబ్ధాల తరువాత ఏకపక్షంగా మూడోంతుల మోజారిటీని సాధించి పెట్టింది. ఇక అంతే ప్రధానిగా మోదీ చేసిన అన్ని పర్యటల్లో సెల్పీలకు ప్రధాన్యం. సోషల్ మీడియాతో తన అభిమానులతో నిత్యం టచ్ లో వుండే మోడీని నెట్ జనులు కూడా బాగానే అధరించారు. ఇక మోడీ అమెరికా అద్యక్షుడితో కలసినా.. లండన్ పర్యటనలకు వెళ్లిన విదేశాల పర్యటనలలోనూ సెల్పీలకు ప్రాముఖ్యత. సమకాలీన రాజకీయాల్లో సోషల్ మీడియాను  అంతగా వినియోగిస్తున్న నాయకుడు మరొకరు లేరంటే అతిశయం కాదు. అయితే అదే సెల్సీలను దేశంలో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీకి జరిగిన  ఎన్నికలలో వినియోగించి లబ్ది పోందాలని భావించిన బీజేపి చేతులు కాల్చుకుంది. దీంతో బిహార్ ఎన్నికలలో ఆయన సెల్పీలకు దూరంగా వున్నారు. ఈ అనూహ్య పరిణామానికి కారణం ఏమిటి? అని ఆరా తీస్తున్నారా..?

అసుల విషయం ఏమిటంటే.. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ఎన్నికల సందర్భంగా 'మోదీతో సెల్ఫీ' (సెల్ఫీ విత్ మోదీ) అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బీజేపీ నాయకులు. ఢిల్లీలోని అన్ని నియోజకవర్గాల్లో మొత్తం ఏడు విడతలుగా సాగిన ఈ కార్యక్రమంలో.. తాత్కాలిక బూత్ లను, వాటిలో మోదీ వర్చువల్ ఇమేజ్(కాల్పనిక చిత్రం)ను ఏర్పాటు చేశారు. ఆ ఇమేజ్తో సెల్ఫీ తీసుకుంటే.. స్వయంగా మోదీనే మన పక్కనున్నట్లు కనిపిస్తుంది. లక్షలాది ఢిల్లీ ప్రజలు మోదీతో సెల్ఫీలు దిగి ఆ గుర్తును భద్రంగా సేవ్ చేసుకున్నారు. కాగా, ఒక్కో విడత.. మోదీ విత్ సెల్ఫీకి రూ. 86.50 లక్షలు వెచ్చించామని, అలా ఈ కార్యక్రమానికి మొత్తం రూ. 1.06 కోట్ల ఖర్చయ్యాయని తేలింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఖర్చుల జాబితాలో బీజేపీ పేర్కొంది. అయినా తమను ఓటర్లు అధరించకుండా అప్ ను అక్కున చేర్చుకున్నారని.. అందుచేతే అది అక్కడ అచ్చిరాలేదు కాబట్టే.. ఇక్కడ ఊసుకూడా తీయవద్దని బీజేపి బావిస్తుందట.

అంత ఖర్చయినా ఫర్వాలేదుగానీ ఓట్లు మాత్రం కమలానికి కాకుండా చీపురుకు పడటమే జీర్ణించుకోలేకపోయారు ఆ పార్టీ నేతలు. విఫల ప్రయోగం మళ్లీ ఎందుకని బిహార్ ఎన్నికల ప్రచారంలో సెల్ఫీ ఐడియాను అటకెక్కించారు. అయితే మోదీ తీసుకున్నది విరామం మాత్రమేనని.. నవంబర్ 12 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటనలో మళ్లీ సెల్ఫీలు చిందిస్తారని ఆశిస్తున్నారు ఆయన అభిమానులు. అన్నట్లు గత ఎన్నికల్లో 'త్రీడీ ప్రచారం' గుర్తుందిగా. ప్రసంగాలను ముందే త్రీడీలో చిత్రీకరించి, ప్రత్యేక స్క్రీన్ లు ఉన్న వాహనాల ద్వారా ఊరూరా ప్రచారం చేసినందుకుగానూ రూ.60 కోట్లు ఖర్చయినట్లు బీజేపీ తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar elections  Selfie with Modi  Delhi polls  BJP  PM Modi  

Other Articles