Iraqi government issued ultimatum to actress sadaf to leave movies soon for posting photographs herself without hijab on facebook | iranian actress branded immoral

Iraqi government issued ultimatum to actress sadaf leave movies for posting photographs without hijab

iraqi actress sadaf, iraqi govt ultimatum to sadaf, iraqi sadaf branded as immoral, iraqi immoral controversy, iraqi photos without hijab, iraqi actress sadaf controversy

Iraqi government issued ultimatum to actress sadaf leave movies for posting photographs without hijab : Iraqi government issued ultimatum to actress sadaf to leave movies soon for posting photographs herself without hijab on facebook. she is also branded as 'immoral' by state media and sparks public outcry.

‘సినిమాల్లో నటించడం ఆపేయ్’.. నటికి అల్టిమేటం

Posted: 10/30/2015 07:40 PM IST
Iraqi government issued ultimatum to actress sadaf leave movies for posting photographs without hijab

సినీప్రపంచంలో ఓ వెలుగు వెలుగుదామని అడుగుపెట్టిన ఓ హీరోయిన్ కి అప్పుడే నిరాశ ఎదురైంది. ‘సినిమాల్లో నటించింది చాలు.. ఇక ఫుల్ స్టాప్ పెట్టు’ అంటూ ఆమెకు అల్టిమేటం జారీ అయ్యింది. ఇది జారీ చేసింది కూడా ఆమె కుటుంబసభ్యులో లేక కట్టుకున్నవాడో కాదు.. ఏకంగా దేశ ప్రభుత్వమే హెచ్చరిక చేసింది. దీంతో ఆ నటి ఆందోళనల్లో పడిపోయింది. ఇంతకీ ఈ అల్టిమేటం జారీ చేయడానికి గల కారణాలేంటో తెలుసా.. తలపై ముసుగు (హిజాబ్) లేకుండా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిందని ఇక సినిమాల్లో నటించొద్దంటూ ఆ దేశ ప్రభుత్వం అలా హెచ్చరించింది.

ఇరాన్ దేశానికి చెందిన నటి సదాఫ్ గతకొన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోంది. అక్కడ సంస్కృతీ-సంప్రదాయాలు, ఆచారాలు, నిబంధనల ప్రకారం సినిమాల్లో కూడా మహిళలు ముసుగు వేసుకుని నటించాల్సి వుంటుంది. ఆ నిబంధనల మేరకే ఈమె కూడా నటిస్తూ వచ్చింది. అయితే.. ఈ రూల్స్ ఏమాత్రం నచ్చని ఆమె తాజాగా ముసుగు తీసేసి ఫోటోలు దిగింది. అంతేకాదు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తనకి ఇలా వుండడమే ఇష్టమంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ ఫోటోలను గమనించిన ఇరాక్ ప్రభుత్వం ఒక్కసారగా ఆగ్రహానికి గురైంది. హిజాబ్ (ముసుగు) లేకుండా ఆడపిల్ల కనిపించడం తప్పు అని స్పష్టం చేస్తూ, తక్షణం సినిమాల్లో నటించడం మానేయాలని ఆమెకు అల్టిమేటం జారీ చేసింది. అంతేకాదు.. హిజాబ్ ధరించకుండా కనిపించడం అనైతికం అని పేర్కొన్న ప్రభుత్వ వర్గాలు ఆమె ఫోటోకు గ్రాఫిక్స్ చేసి ఓ హిజాబ్ (ముసుగు) తొడగడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న సదాఫ్.. ఇప్పుడు తీవ్ర మనోవేదనకు గురికావడంతోపాటు ఆందోళనలో పడింది.

ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంపై సదాఫ్ మాట్లాడుతూ... తాను ఇరాన్ నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుందని ఊహించలేదని తెలిపింది. ఇరాక్ ప్రకటనకు ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదని చెప్పింది. తాను జీవించాలనుకున్న చోట, ఎలా ఉంటే ఆనందంగా ఉండగలనో అలా ఉంటానని స్పష్టం చేసింది. ఇలాంటి వేధింపులు ఇరాన్ లోనే కాదని, తన వృత్తిలో కూడా ఉన్నాయని సదాఫ్ వెల్లడించింది. తాను నటిస్తున్నప్పుడు దర్శకుడు తనను తప్ప, తన నటనను చూడడం లేదని వాపోయింది. సీన్ ఎప్పుడైపోతుందా? తన చెవిలో గుసగుసలు ఎప్పుడు మొదలు పెడదామా? అని చూస్తున్నారని, సినీ రంగం మొత్తం అలాగే ఉందని తెలిపింది. ఐదారు కాంట్రాక్టులు చేతిలో ఉంచుకుని, తమతో నెల రోజులు గడిపితే ఆ కాంట్రాక్టులు ఇస్తామంటారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు నచ్చినట్లుగా జీవించే హక్కు అమ్మాయిలకు లేదా? అంటూ ప్రశ్నించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles