Rein in BJP members or risk losing global credibility

Rein in bjp members or risk losing global credibility

Modi, Moodys, India, PM, Global credibility, BJP, NDA, Parliament, Nerandra Modi

Prime Minister Narendra Modi must keep "his party members in check" from making controversial statements "or risk losing domestic and global credibility", an arm of global ratings agency Moody's said on Friday while urging the government to focus its attention on the reforms agenda.

మోదీ మూడ్ తగ్గుతోంది.. కారణాలు ఇవే

Posted: 10/31/2015 08:23 AM IST
Rein in bjp members or risk losing global credibility

బీఫ్‌ వంటివాటిపై చెలరేగుతున్న దుమారం వల్ల దేశం నమ్మకం కోల్పోతుందని ప్రధాని నరేంద్ర మోడీని మూడీస్‌ అనలైటిక్స్‌ హెచ్చరించింది. ఇండియా ఔట్‌లుక్‌ పేరుతో విడుదల చేసిన నివేదికలో వృద్ధి లక్ష్యాలను సాధిం చాలంటే హామీ ఇచ్చిన సంస్కరణలను అమలు చేయాలని పేర్కొంది.

అందులో మోదీ ప్రభుత్వం గురించి పేర్కొన్న అంశాలు..
* అధికారంలో ఉన్న బీజేపీకి రాజ్యసభలో ఆధిక్యత లేదు.
* కీలక సంస్కరణల బిల్లులకు ప్రతిపక్షం అడ్డుకుంటోంది.
* ఇటీవలి కాలంలో అధికార పక్షం కూడా తనకు తాను సాయం చేసుకోవడం లేదు.
* బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
* మోడీకి జాతీయవాది ముద్ర దూరమవుతోంది.
* మైనారిటీలను రెచ్చగొట్టే వైఖరివల్ల ప్రాంతీయ ఉద్రిక్తతలు బయల్దేరుతున్నాయి. హింస పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* రాజ్యసభలో తీవ్ర స్థాయిలో ఎదురు గాలి తప్పదు.
* చర్చ ఆర్థిక విధానం నుంచి దారి మళ్లుతుంది.
* మోడీ తన పార్టీ సభ్యులకు కళ్లెం వేయాలి, లేదంటే దేశీయంగా, అంతర్జాతీయంగా విశ్వసనీయత కోల్పోవ డానికి సిద్ధమవాలి.

సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతం కాగా, ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతం ఉంటుంది. కీలక ఆర్థిక సంస్కరణలు ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతాయి. తద్వారా జీడీపీ వృద్ధి చెందుతుంది. భూ సేకరణ బిల్లు, వస్తువులు, సేవల పన్ను బిల్లు, కార్మిక చట్టాలు వంటివాటికి ఆమోదం పొందడం తప్పనిసరి. 2015లో ఇది సాధ్యమ య్యలా కనిపించడం లేదు, ఐతే 2016లో ఆ అవకా శం ఉన్నట్లు చెప్పవచ్చు. వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థకు స్వల్ప కాలంలో సాయపడేవిధంగానే ఉన్నాయి. దీర్ఘకాలిక వృద్ధి సాధించాలంటే సంస్కరణలు అవసరం. రిజర్వు బ్యాంకు ఈ ఏడాది రెపో రేటును 1.25 శాతం కోత విధించడం ద్వారా రికవరీని ప్రారంభించింది. భారతీ య స్టేట్‌ బ్యాంకు ఈ నెల ప్రారంభంలో బేస్‌ లెండింగ్‌ రేటును తగ్గించడం శుభ పరిణామం. సెన్సెక్స్‌ దాదా పు 11 శాతం పతనమైంది. కీలక ఆర్థిక సంస్కరణలు అమలు కాకపోవడంతో కొత్త ప్రభుత్వంపై ఆశలు నీరుగారిపోయాయి. ఆర్బీఐ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగిన స్థాయిలో ఉండటం వల్ల రూపాయి రికవరీ అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Moodys  India  PM  Global credibility  BJP  NDA  Parliament  Nerandra Modi  

Other Articles