Tamil folk singer Shivadas held for writing lyrics with derogatory remarks against Jayalalithaa

Tamil folk singer shivadas held for writing lyrics with derogatory remarks against jayalalithaa

Tamilnadu, Folk singer, Kovan, shivadas, chennai, Jayalalitha

Cybercrime police on Friday arrested a folk singer for allegedly making derogatory remarks against Tamil Nadu chief minister J Jayalalithaa in lyrics he has written. A police team from Chennai nabbed the singer, S Sivadas alias Kovan (45), from his house at Maruthanda Kurichi near Tiruchi at 2am. He was brought to Chennai for further inquiry.

ఆ సిఎం మీద పాట పాడినందుకు..పోలీస్ కేసు

Posted: 10/30/2015 01:51 PM IST
Tamil folk singer shivadas held for writing lyrics with derogatory remarks against jayalalithaa

భారత దేశంలో స్వేచ్ఛ ఉంది.. కానీ దానికి కండీషన్స్ అప్లై. తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చు కానీ పక్కవాడికి ఎలాంటి అభ్యంతరం రానంత వరకు మాత్రమే. ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా...? తాజాగా ఓ సింగర్ పాట పాడినందుకు అరెస్టయ్యాడు. అదేంటి పాట పాడినంత మాత్రాన అరెస్ట్ అవుతారా.? అనే అనుమానం కలుగుతుందేమో. అవుతారు ఎందుకంటే అది పాడింది మామూలు వ్యక్తి మీద కాదు.. ఓ రాష్ట్రానికి సిఎం మీద. అవును సిఎం మీద పాట పాడినందుకు.. ఆ పాటను ఆన్ లైన్ లో పెట్టినందుకు కటకటాలపాయ్యాడు. ఇంతకీ ఎక్కడ జరిగింది.? ఏం జరిగింది.? తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన శివదాస్ అనే జానపద గాయకుడు సిఎం జయలలితకు వ్యతిరేకంగా పాటలు పాడారు. సొంతంగా లిరిక్స్ రాసి.. పాట పాడిన శివదాస్ మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు. లిక్కర్ షాపుల మీద జయలలిత ప్రభుత్వం చూపిస్తున్న ఉదారతపై తన పాటలో వివరించారు. అయితే శివదాసన్ మీద ఐపిసి 124ఎ సెక్షన్ కింద కేసు నమోదైంది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న అతడిని లాయర్ కూడా కలవలేకపోయారు. దాంతో అతని తరఫు లాయర్ కోర్ట్ లో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. మరి చూడాలి ఈ కేసు వ్యవహారం ఎక్కడి దాకా వస్తుందో...?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamilnadu  Folk singer  Kovan  shivadas  chennai  Jayalalitha  

Other Articles