the extravagant London weddings of the super rich Nigerian couples

The extravagant london weddings of the super rich nigerian couples

Wedding, marriage, extravagant London weddings, London, eamonn, Ruth, London wedding

'It is not unusual to spend a million. One of the weddings I planned spent £50,000 just on flowers,' she reveals on Channel 5 show Eamonn & Ruth: How The Other Half Lives.'It's a competition, people want something like "wow, she arrived by plane". The bride wants to look good and wear the best of everything.'

ఆ పెళ్లి ఖర్చు వింటే షాక్

Posted: 10/30/2015 01:28 PM IST
The extravagant london weddings of the super rich nigerian couples

లండన్ లో జరిగిన ఓ పెళ్ళి అత్యంత ఖరీదైనదిగా నిలుస్తోంది. పశ్చిమ ఆఫ్రికాకు చెందిన జంటకు లండన్-లో ఏర్పాటు చేసిన పెళ్ళి తంతు నిజంగానే భూలోక అద్భుతాన్ని తలపించింది. నైజీరియాకు  చెందిన అత్యంత సంపన్న కుటుంబంలోని మహిళలు తమ వివాహానికి మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. వివాహ సన్నివేశం జీవితాంతం గుర్తుండిపోవాలని, ఒకరి కంటే మరొకరు తమ ఉన్నతిని చాటుకునేందుకు పోటీ పడుతున్నారు. కేవలం వధూవరుల డిజైనర్ దుస్తులకు వంద వేల యూరోలు, అతిథులకు ఆల్కహాల్ కోసం 150 వేల యూరోలు ఖర్చు చేశారు. వివాహ సమయంలో ఆఫ్రికా సంపన్నుల గమ్యమే మారిపోయిందని, పెళ్ళి సమయంలో వావ్ అనిపించుకునేట్లు చేయాలన్న పోటీ మాత్రమే ఇక్కడి సంపన్నుల్లో కనిపిస్తోందని, వారు ధరించే ప్రతి వస్తువూ ఉత్తమమైనదిగా ఉండాలని కోరుకుంటున్నారని ఈవెంట్ నిర్వాహకులు ఎలిజబెత్ ఐసియన్ చెప్తున్నారు.

ఈ పెళ్లిలో వధువు ధరించే డిజైనర్ వస్త్రాలకు వంద వేల యూరోలు, డైమండ్ జ్యువెలరీకి 475 వేల యూరోలు వెచ్చించారు. వారు ధరించిన ప్రతి వస్తువూ ఇతరుల కంటే భిన్నంగా, ఖరీదైనదిగా ఉండాలనేదే వారి ధ్యేయం. ఇటువంటి గుర్తింపు కోసం పెళ్ళి జరిపేందుకు లండన్-లోని పేరొందిన ఖరీదైన హోటల్స్-ను కూడ ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా కెన్సింగ్టన్ ప్యాలెస్ ఇప్పుడు నైజీరియన్లకు అత్యంత ఇష్టమైన వేదికగా మారిందని ఈవెంట్ మేనేజర్ ఎలిజబెత్ చెప్తున్నారు.

చారిత్రక కట్టడమైన రాయల్ ప్యాలెస్-లో వివాహం నిర్వహించాలంటే క్యాటరింగ్, వ్యాట్ కాకుండానే కనీసం 12 వేల 5 వందల యూరోల ఖరీదు ఉంటుంది. తమ తమ వివాహాలను అత్యంత ప్రత్యేకంగా నిర్వహించుకోవడంలో భాగంగా వధువులు కనీసం మూడు వేల మందికి భోజనాలు పెడతారు. అందులో ప్రతి ఒక్కరికీ ఒక్కో షాంపెయిన్ బాటిల్ కూడ అందేలా చూస్తారు. ఈ షాంపెయిన్ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. దీన్ని బట్టి చూస్తే సుమారుగా ఓ నైజీరియన్ వివాహం జరగాలంటే కనీసం 150 వేల యూరోలు ఖర్చువుతుందని ఈవెంట్ నిర్వాహకులు చెప్తున్నారు. వచ్చిన అతిథులకు ఒక్క భోజనం పెట్టి, షాంపెయిన్ ఇవ్వడమే కాదట కనీసం ఆరు వేల యూరోల ఖరీదు చేసే గిఫ్ట్ ప్యాక్ కూడ అందిస్తారట. ఈ బ్యాగ్-లో 345 యూరోల పెర్ఫ్యూమ్, 350 యూరోల ఖరీదుండే ఓ కాశ్మీరీ స్కార్ఫ్, ఐదువేల యూరోల ఖరీదైన వాచ్ పెట్టి ఇస్తారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wedding  marriage  extravagant London weddings  London  eamonn  Ruth  London wedding  

Other Articles