indian cricket team former captain kapil dev said his opinions on sachin's career | india cricket team | sachin tendulkar

Kapil dev interesting comments on master blaster sachin career

kapil dev, sachin tendulkar, kapil dev with sachin, sachin latest updates, sachin controvesies, sachin tendulkar updates, india cricket team, sachin double ton

kapil dev interesting comments on master blaster sachin career : Former India captain Kapil Dev says the iconic Sachin Tendulkar "did not know how to make double hundreds, triple hundreds and 400 though he had the ability" to scale such peaks and was "stuck in the Mumbai school of cricket.

‘సచిన్ తన ట్యాలెంట్ కు పూర్తి న్యాయం చేయలేదు’

Posted: 10/29/2015 04:17 PM IST
Kapil dev interesting comments on master blaster sachin career

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలో ఎన్ని రికార్డుల మోత మోగించాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే.. ఆయనను అభిమానులు క్రికెట్ దేవుడిగా పరిగణిస్తారు. ఆయన రిటైర్ అయి సంవత్సరం దాటినప్పటికీ.. ఏదైనా మ్యాచ్ ను వీక్షించేందుకు ఓ మైదానానికి వెళ్తే చాలు.. అక్కడ ఆయన నినాదాలు తప్ప మరేవీ వినిపించవు. దట్ ఈజ్ మాస్టర్ క్లాస్. అటువంటి క్రికెట్ దిగ్గజంపై తాజాగా భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు సంధించాడు.

సచిన్ తనకున్న టాలెంట్ కు పూర్తి న్యాయం చేయలేకపోయాడని కపిల్ దేవ్ అన్నాడు. సచిన్ టెండూల్కర్ లో విశేషమైన  ప్రతిభ ఉన్నా దానికి సరైన న్యాయం చేయలేకపోయాడని ఆయన అభిప్రాయపడ్డాడు. సచిన్ తన టాలెంట్ తో మరిన్ని డబుల్, ట్రిపుల్ సెంచరీలు చేసే అవకాశం ఉన్నా చేయలేకపోయాడని కపిల్ వ్యాఖ్యానించాడు. సచిన్ పై తాను తాజాగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకోవద్దని కపిల్ తెలిపాడు. సచిన్ తన అవకాశాలను మరికొంత బాగా వినియోగించుకుని ఉంటే క్రికెట్ చరిత్రలో సుదీర్ఘ కాలం నిలిచిపోయేవాడని కపిల్ పేర్కొన్నాడు. క్రికెట్ రంగంలో 24 సంవత్సరాలపాటు సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన సచిన్ కు తన ప్రతిభ నిరూపించుకునేందుకు ఎన్నో అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినయోగం చేసుకోలేకపోయాడంటూ ఆయన చెప్పాడు.

'సచిన్ కు సెంచరీలు చేయడం వరకూ తెలుసు. కానీ.. వాటిని డబుల్, ట్రిపుల్ సెంచరీలుగా ఎలా మలచాలన్నది తెలియదు. ఒకవేళ సచిన్ తన టాలెంట్ ను మరింత వినియోగించుకుని వుంటే.. క్రికెట్ చరిత్రలో మరికొన్నికాలాలుపాటు కీర్తి ప్రతిష్టలు అతని సొంతమయ్యేవి’ అని కపిల్ తెలిపాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ తో సరితూగే క్రికెటర్ గా సచిన్ ఎదిగేవాడన్నాడు. క్రికెట్ ప్రపంచంలో సచిన్ సరైన క్రికెటర్ అని కొనియాడాడు. సాంకేతికంగా సచిన్ లో చాలా పరిణితి  ఉన్నా దానిని సక్రమంగా ఉపయోగించుకోలేదన్నాడు. సచిన్ కేవలం సెంచరీలతోనే సరిపెట్టి అతని టాలెంట్ ను పూర్తిగా బయటకు తీయలేదని కపిల్ పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kapil dev  sachin tendulkar  

Other Articles