IndiGo Stops Woman In Short Dress From Boarding Flight As Staff Finds Her Dress ‘Inappropriate’ | women in short dress

Indigo airline stops woman in short dress from boarding flight

indigo airlines, indigo airlines stops woman, women in short dress, indigo airlines photos, woman in Inappropriate dress

Indigo Airline stops woman in short dress from boarding flight : IndiGo Stops Woman In Short Dress From Boarding Flight As Staff Finds Her Dress ‘Inappropriate’

పొట్టి దుస్తులేసుకుంది.. అవమానం పాలైంది!

Posted: 10/29/2015 05:59 PM IST
Indigo airline stops woman in short dress from boarding flight

పాశ్చాత్త దేశాల్లో మహిళలు చాలా పొట్టి డ్రెస్సులు ధరిస్తుంటారు. ఫ్రాక్ కి తక్కువ, బికినీకి కాస్త ఎక్కువగా వుండే దుస్తులును సైతం ధరిస్తూ బహిరంగంగానే తిరుగుతుంటారు. మరికొందరు ఘాటు భామలైతే అంతకంటే దారుణంగా మరీ చిన్న బట్టలు ధరించి, హోయలొలుకుతూ వయ్యారాలు పోతుంటారు. ఇటువంటి కల్చర్ కొనసాగుతున్న నేటి ఆధునిక యుగంలో ఓ మహిళకు మాత్రం పొట్టి డ్రెస్సు ధరించినందుకు తీవ్ర అవమానం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫ్రాక్ ధరించిన ఆమెను చాలా పొట్టి డ్రెస్సులు ధరించుకుని నిస్సిగ్గుగా తిరుగుతున్నావంటూ ఆమెను కొందరు నిలదీశారు. దీంతో కాస్త మనస్తాపానికి గురైన సదరు మహిళ... తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుని చివరికు ఆ దుస్తులు తొలగించి, సాధారణ బట్టలు వేసుకోక తప్పలేదు.

ఫ్రాక్ ధరించిన ఓ మహిళా ప్రయాణికురాలు ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో దోహా నుంచి ముంబై వచ్చింది. అక్కడి నుంచి ఢిల్లీకి కనెక్టడ్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే ముంబైలో ఆమెను విమానం ఎక్కనివ్వకుండా ఇండిగో సిబ్బంది అడ్డుకున్నారు. ఎందుకంటే.. ఆమె సరైన దుస్తులు వేసుకోలేదని, చాలా పొట్టి దుస్తులు ధరించిందని, అందుకే ఆమెను విమానం ఎక్కేందుకు అనుమతించలేదని తెలిసింది. నిజానికి ఆమె మోకాళ్లవరకు వున్న ఫ్రాక్ ను ధరించినప్పటికీ.. అది చాలా పొట్టిగా వుందంటూ విమానంలో ఎక్కనివ్వలేదు. ఈ ఘటన గురించి సహచర ప్రయాణికురాలైన పురబి దాస్ తన ఫేస్‌బుక్ పేజీలో వివరించారు. ఇండిగో పురుష సిబ్బంది ఆ యువతిని ఈ విధంగా వేధించడం తనను ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. 'మోకాళ్ల వరకు ఉన్న ఫ్రాక్‌ను ధరించినప్పటికీ ఆమెను విమానంలో ఎక్కనివ్వలేదు. ఆమె దుస్తులు వారికి అభ్యంతరకరంగా కనిపించాయి. కానీ ఆ సంస్థ ఎయిర్‌హోస్టెస్‌ మాత్రం అదే తరహా ఫ్రాక్‌లు ధరిస్తారు. మరి.. వారినెలా విమానంలో ఎక్కేందుకు అనుమతినిస్తున్నారు' అని ఆమె ప్రశ్నిస్తూ తన పోస్టులో పేర్కొన్నారు.

ఏదేమైనా... ఈ ఘటనతో ఆమె ఎక్కాల్సిన విమానం మిస్సయింది. అనంతరం వేరే వస్త్రాలు ధరించిన తర్వాత ఆమె మరో విమానంలో వెళ్లేందుకు అనుమతించారని తెలిసింది. నిజానికి ఆ ప్రయాణికురాలు ఇండిగో సంస్థకు చెందిన ఉద్యోగి సోదరి. అయితే తమ డ్రెస్ కోడ్ నిబంధనల్లో భాగంగానే ఆమెను అడ్డుకోవాల్సి వచ్చిందని ఇండిగో సంస్థ తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indigo airlines stops woman  women in short dress  

Other Articles