Modi and Gandhi among most admired globally

Modi and gandhi among most admired globally

Modi, Gandhi, WOrld Economic forum, Nelson Mandela

Prime Minister Narendra Modi is the 10th most admired personality globally, as per a new survey by the World Economic Forum (WEF) that has ranked late South African President Nelson Mandela on the top. Mahatma Gandhi is ranked fourth most admired leader, according to a survey of more than 1,000 millennials. The respondents were spread across 285 cities in 125 countries.

గాంధీ తర్వాత మోదీనే.. జనం మెచ్చిన నేత

Posted: 10/29/2015 09:00 AM IST
Modi and gandhi among most admired globally

భారత చరిత్రలో మన జాతిపిత మహాత్మా గాందీ తర్వాత అధికంగా భారతీయులు ఇష్టపడే వారు ఎవరూ అంటే నరేంద్ర మోదీ. నిజానికి భారతీయుల కంటే కూడా ప్రపంచంలో గాంధీ తర్వాత అతిగా ఇష్టపడే వారిలో మోదీ చోటుదక్కించుకోవడం విశేషం. వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. జాబితాలో జాత్యహంకార వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అగ్రస్థానంలో నిలిచారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ నాలుగో స్థానంలో ఉన్నారు. మోదీకి పదో స్థానం లభించింది. వెయ్యి మంది ప్రముఖ వ్యక్తులను తీసుకొని అందులో అతిగా ఆదరణ ఉన్న వారిని టాప్ ఆర్డర్ ఇచ్చారు.

ఈ సర్వేలో 125 దేశాల్లోని 285 నగరాలకు చెందినవారు పాల్గొని అభిప్రాయాలు చెప్పారు. రెండో స్థానం పోప్ ఫ్రాన్సిస్‌కు దక్కింది. తదుపరి స్థానాల్లో టెస్లా మోటార్స్ సీఈవో ఎలోన్ ముస్క్ (మూడవ స్థానం), మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (5), అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (6), వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బార్సన్ (7), యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ (8), నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనిస్(9) ఉన్నారు.  125 దేశాల్లోని 285 నగరాల్లో ఈ సర్వేను నిర్వహించి.. ఫైనల్ గా టాప్ పది మంది ఆదరణ గల వ్యక్తుల పేర్లును వెల్లడించింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మొత్తానికి దేశవిదేశాలు తిరిగి భారత కీర్తి పథాకాలను ఎగరవేస్తున్న మోదీకి గాంధీ తర్వాత అంతటి గుర్తింపు లభించడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Modi  Gandhi  WOrld Economic forum  Nelson Mandela  

Other Articles