pawan kalyan's janasena party identified as political party by telangana election commission | central election commission

Telangana election commission given identification as political party to janasena party

pawan kalyan news, pawan kalyan janasena, janasena party news, telangana election commission, janasena party updates, janasena party identified, pawan kalyan controversies

telangana election commission given identification as political party to janasena party : finally pawan kalyan's janasena party identified as political party by telangana election commission.

తెలంగాణలో పవన్ ‘జనసేన’కు గుర్తింపు

Posted: 10/28/2015 06:54 PM IST
Telangana election commission given identification as political party to janasena party

గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘జనసేన’ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే! ఈ పార్టీకి తాజాగా తెలంగాణ ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీగా గుర్తింపునిచ్చింది. ‘జనసేన పార్టీ’కి గుర్తింపునివ్వాల్సిందిగా పవన్ గతంలో దరఖాస్తు చేసుకోగా.. ఇప్పుడు ఆ పార్టీని జనసేన పార్టీని రిజిస్ట్రర్ చేసినట్లు తెలంగాణ ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. 2019లో జరగనున్న ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, భవిష్యత్ లో ఆ పార్టీ కీలకంగా మారనుందని సంకేతాలను పంపింది.

ఇదిలావుండగా.. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రకటనతో.. పవన్ రాజకీయ కదలికలపై అనుమానం వ్యక్తం చేసిన వారికి ఓ క్లారిటీ వచ్చినట్లైంది. అంటే.. రాజకీయ పార్టీని స్థాపించి ఆయన కేవలం సినిమాలకే పరిమితం అయ్యారని.. పబ్లిసిటీ కోసమే తప్ప ప్రజలకోసం ఆయన పార్టీని స్థాపించలేదని గతంలో వాదనలు వినిపించారు. అంతేకాదు.. కొందరు రాజకీయ ప్రముఖులు సైతం పవన్ పార్టీపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు. పవన్ మేనియా సినీ ఇండస్ట్రీలోనే తప్ప రాజకీయాల్లో పనికిరాదంటూ ఆమధ్య కామెంట్లు చేసిన సందర్భాలూ చాలానే వున్నాయి. అటువంటివారికి తాజాగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రకటన కాస్త గుబులు పట్టించిందని అనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాల్ని పక్కా ప్లానింగ్ తో కొనసాగిస్తున్నారని, ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో కూడా దూసుకెళుతున్నాడని, ఇప్పుడు ఎన్నికల రంగంలో దిగనున్న సందర్భంలో అందరూ చాకచక్యంగా వ్యవహరించాలంటూ రాజకీయ నేతలు చెవులు కోరుక్కుంటున్నారని అంతర్గతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. రాజకీయ ప్రస్ధానంలో పవన్ కల్యాణ్ జాగ్రత్తగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. పార్టీని రిజిస్టర్ చేయడం ద్వారా భవిష్యత్ రాజకీయాల్లో జనసేన కీలకంగా మారనుందనే సంకేతాలు పంపారు. రానున్న జీఎచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా పవన్ పక్కా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. తెలంగాణ ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గుర్తింపునివ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవన్ అభిమానులు సైతం సంతోషం వెల్లడిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena party  telangana election commission  

Other Articles