controversial director ram gopal varma has creates sensation by tweeting on mafia don chota rajan | bollywood updates

Ram gopal varma sensational tweet on chota rajan

ram gopal varma news, rgv twitter, ram gopal varma controversies, chota rajan arrest, tollywood updates, chota rajan history

ram gopal varma sensational tweet on chota rajan : controversial director ram gopal varma has creates sensation by tweeting on mafia don chota rajan.

‘ఛోటా రాజన్ ఎవరి పేర్లు బయటపెడతాడో’ : వర్మ ట్వీట్

Posted: 10/28/2015 07:22 PM IST
Ram gopal varma sensational tweet on chota rajan

ప్రశాంతంగా వున్న వాతావరణాన్ని వివాదాస్పదంగా ఎలా మార్చాలో రాంగోపాల్ వర్మకు తెలిసినట్లు మరెవ్వరికీ తెలియదనుకోవడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇందుకు ఉదాహరణలుగా ఇప్పటికే ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయిలెండి.. ఇప్పుడు తాజాగా ఆయన మరో ఆసక్తికరమైన ట్వీట్ చేసి సంచలనంగా నిలిచిపోయారు. ఏకంగా మాఫియా డాన్ ఛోటారాజన్ పై ఆయన ట్వీట్ చేశాడు. 22 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఆ డాన్ అరెస్టుపై వర్మ సంచలన ట్వీట్ చేశాడు.

'ఇన్నాళ్లూ గ్యాంగ్ను నడపటంలో చోటా రాజన్ కు ఎవరెవరు సహకరించారు? ఎంత మంది పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల పేర్లను చోటారాజన్ వెల్లడిస్తాడో? ప్రస్తుతం నాకు అత్యంత ఆసక్తి కలిగిస్తున్న విషయం ఇదే' అంటూ బుధవారం ఓ ట్వీట్ వదిలాడు వర్మ. భారత నిఘా వర్గానికి చెందిన అధికారులు కొందరు దావూద్ను మట్టుబెట్టేందుకు చోటా రాజన్ను ఉపయోగించుకున్నారని, ఆ క్రమంలో పరోక్షంగా చోటా గ్యాంగ్ విస్తరణకు సహకరించానే సారాంశంతో వార్తాకథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో వర్మ కూడా ఇదే కోణంలో ట్వీట్ చేయడం చర్చనీయంశంగా మారింది. ఏదేమైనా.. వర్మ తన ట్వీట్ తో వెల్లడించిన అభిప్రాయం ఇప్పుడు ప్రతిఒక్కరి మదిలో మెదులుతోందని చెప్పుకుంటున్నారు.

ఇదిలావుండగా.. మాఫియా కథాంశాలతో ఒకప్పుడు బాలీవుడ్లో కుప్పలు తెప్పలు సినిమాలు తీసి.. డాన్ల జీవితాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చూపించాడు వర్మ. 2002లో ఆయన తీసిన 'కంపెనీ' సినిమా.. దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ల సంబంధాలకు తెర రూపమని చెబుతారు సినీ విశ్లేషకులు. మాఫియా ప్రపంచం గురించి వర్మ చేసినంత రీసెర్చ్ మరెవరూ చేసి వుండవకపోవచ్చంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి ఆయన ఇప్పుడు ఛోటా రాజన్ పై తన పిట్టను విసరడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  chota rajan arrest  

Other Articles