public prosecutor raja thakre demands court death sentence to chandrabhan who killed telugu techie girl anuhya in mumbai after rape

Public prosecutor raja thakre demands death sentence to chandrabhan who killed techie anuhya

techie anuhya murder case, esther anuhya murder case, esther anuhya chandrabhan, taxi driver chandrabhan, public prosecutor raja thakre, raja thakre mumbai court

public prosecutor raja thakre demands death sentence to chandrabhan who killed techie anuhya : public prosecutor raja thakre demands court death sentence to chandrabhan who killed telugu techie girl anuhya in mumbai after rape. he also burnt her body.

‘టెక్కీ అనూహ్య హంతకుడికి ఉరిశిక్ష విధించండి’

Posted: 10/28/2015 04:08 PM IST
Public prosecutor raja thakre demands death sentence to chandrabhan who killed techie anuhya

తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీగా తేలిన చంద్రభాన్కు ఉరిశిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. 2014 జనవరి 5వ తేదీన ముంబై రైల్వేస్టేషన్ వద్ద అనూహ్య అదృశ్యమైన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఆచూకీ కోసం గాలించిన పోలీసులకు చుక్కలు కనిపించాయి. అనంతరం తమదైన రీతిలో వారు విచారణ చేపట్టగా.. ఆమె అదృశ్యం వెనుక ఓ టాక్సీ డ్రైవర్ హస్తముందని తేలింది. దీంతో అతడిని విచారించగా.. తానే ఆమెను చంపేసినట్లుగా నేరాన్ని ఒప్పుకున్నాడు. స్టేషన్ లో ఒంటరిగా వున్న అనూహ్యను చూసిన డ్రైవర్ చంద్రభాన్.. ఆమెకు మాయమాటలు చెప్పిన తన టాక్సీలో ఎక్కించుకున్నాడు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. అత్యాచారం చేసి చంపేశాడు. అంతేకాదు.. ఆమె మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చేశాడు. ఇంత క్రూరమైన నేరానికి పాల్పడిన చంద్రభాన్ కు ఉరిశిక్ష విధించాల్సిందేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజన్ థాక్రే కోర్టును కోరారు.

ఈ కేసులో శిక్ష విధింపుపై బుధవారం ముంబై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే రాజన్ థాక్రే దాదాపు 80 నిముషాల పాటు వాదనలు వినిపించారు. చంద్రభాన్కు ఉరి శిక్ష విధించాలని ఆయన కోర్టును కోరారు. చంద్రభాన్ క్రూరమైన నేరానికి పాల్పడ్డాడని, అనూహ్యను అత్యాచారం చేసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చివేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి కేసుల్లో కోర్టులు కఠినంగా వ్యవహరించాయని, చంద్రభాన్కు అత్యంత కఠిన శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టుకు విన్నవించారు. ఆయన వాదనలు విన్న అనంతరం కోర్టు తుది తీర్పును ఈనెల 30కి వాయిదా వేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ముంబై వెళ్లిన అనూహ్య.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అదృశ్యమైంది. స్టేషన్ లో ఆమెను చూసిన టాక్సీ డ్రైవర్ చంద్రభాన్.. గమ్యాస్థానానికి క్షేమంగా తీసుకెళతానని ఆమెకు మాయమాటలు చెప్పి, అక్కడి నుంచి నిర్మానుష్య ప్రదేవానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. ముంబై కోర్టు చంద్రభాన్ను దోషీగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : esther anuhya murder case  driver chandrabhan  telugu techie girls crimes  

Other Articles