Gundu Sudharani met KCR in Delhi

Gundu sudharani met kcr in delhi

Gundu Sudharani, Warangal, Elections, KCR, TRS,TTDP

Gundu Sudharani met KCR in Delhi. MP Gundu Sudhrani geting ready to join into TRS Soon. She met Telangana cm KCR in Delhi. TRS hope that GUndu Sudharani joining will benefit in this warangal elections.

టిఆర్ఎస్ ఉపఎన్నికల మందు.. గుండు

Posted: 10/28/2015 03:23 PM IST
Gundu sudharani met kcr in delhi

వరంగల్ ఉపఎన్నికల నగారా మోగింది. అన్ని రాజకీయ పార్టీలు యుద్దానికి సిద్దమవుతున్నాయి. విపక్ష పార్టీలు ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం వాటిని ఖాతరు చెయ్యకుండా తన పంథాలో తాను దూసుకెళుతోంది. వరంగల్ ఉపఎన్నికలకు మందు గుండు సిద్దం చేసింది. మందు గుండు అంటే.. నిజంగా సామాగ్రి అనుకునేరు. ఎన్నికల కన్నా ముందే గుండు సుధారాణి టిఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమానికి సరంజామా సిద్దం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో గుండు సుధారాణి తన మందీమాగదులతో గులాబీ దళంలోకి చేరేందుకు అంతా సిద్దమైంది.

దిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ను గుండు సుధారాణి దంపతులు కలుసుకున్నారు. టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు అంతా సిద్దమైంది. గులాబీ దళంలోకి రేపోమాపో చేరుతారు అన్న దాని మీద ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే గుండు సుధారాణి చేరిక వరంగల్ ఎన్నికల్లో పార్టీకి లాభం తెస్తుందని... అందరూ ఆశిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులను తమ పార్టీలోకి చేర్చుకున్న టిఆర్ఎస్ నేతలు కొత్తగా గుండు సుధారాణితో తమ క్యాడర్ మరింత బలపడుతుందని నమ్ముతున్నారు. కానీ గుండు సుధారాణి మాత్రం పార్టీని వీడరని టిటిడిపి నాయకులు ఇంకా అనుకోవడం ఆశ్చర్యంగా ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gundu Sudharani  Warangal  Elections  KCR  TRS  TTDP  

Other Articles