Danam Nagender dance in sangeeth

Danam nagender dance in sangeeth

Danam Nagender, Danam, Ganta Srinivas, Narayana, Danam Dance

Congress Leader Danam Nagender stepup in the sangeeth. Ap Ministers Ganta srinivas son and Narayana daughter getting marriage on this month 30.

ITEMVIDEOS: ఓహో.. స్టెప్పులేసిన దానం.. ఇరగదీశారు

Posted: 10/27/2015 04:52 PM IST
Danam nagender dance in sangeeth

స్టెప్పెలేస్తే... హాల్ లో దుమ్ము రేగుతుంది. ఒక్క సారి డ్యాన్స్ చెయ్యడం మొదలుపెడితే.. ఆ ఊపుకు ఎవరూ ఆగలేరు.. ఆయన్ని ఎవరూ ఆపలేరు.. ఆంతకీ ఏ సినిమాలో హీరోగారు ఇంతలా డ్యాన్స్ లతో అదరగొడుతున్నారు అనుకుంటున్నారా..? సినిమా స్టార్లైతే మరీ ఇంతలా ఎందుకు రాస్తాం... తెలంగాణ కాంగ్రెస్ నేత.. మాజీ మంత్రిగా పని చేసిన దానం నాగేందర్ గారు. దానం నాగేందర్ గారి గురించే మేము ఇప్పటి దాకా రాసింది. దానం నాగేందర్ వేసిన డ్యాన్స్ లకు అందరూ షాక్ కు గురయ్యారు. మంచి ఊపులో స్టెప్పులేసి ఇరగదీసారు. ఎక్కడ.. ఎప్పుడు అనుకుంటున్నారా..? తెలియాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

ఇద్దరు ఏపీ మంత్రులు గంటా శ్రీనివాస్, నారాయణ వియ్యంకులు కాబోతున్నారు.. ఈ నెల 30 న వీళ్ళ ఇళ్ళలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో మాజీ మంత్రి దానం నాగేందర్ డ్యాన్స్ చేసి స్టెప్పులతో అదరగొట్టారు. గంటా శ్రీనివాస్ కుమారుడు రవి తేజకు, నారాయణ రెండో కుమార్తె షాలినికి ఈ నెల 30 న పెళ్లి నిశ్చయమైంది.దీన్ని పురస్కరించుకుని నగరంలో జరిగిన సంగీత్ ఫంక్షన్ కు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. ఓ వైపు పలకరింపులు సాగుతుండగానే ముందు వరుసలో ఉన్నవారిని డ్యాన్స్ స్టార్స్ ఆహ్వానించారు. ఇక దానం నాగేందర్ స్టెప్పులేసి  అందరికి ఆశ్చర్యం కలిగించారు. స్టెప్పులేస్తున్న దానంను మంత్రులు శ్రీనివాస్, నారాయణ చప్పట్లతో ప్రోత్సహించడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Danam Nagender  Danam  Ganta Srinivas  Narayana  Danam Dance  

Other Articles