BBC news Telecast a special story on ap capital Amaravati

Bbc news telecast a special story on ap capital amaravati

Amaravati, BBC News, AMaravati News, AP Capital Amaravati, BBC News on Amaravati, Amaravati updates

International News king, BBC telecast a news on APs new capital Amaravati. BBC express that AP govt distroy the lands and plants in the capital city region.

అమరావతి.. నాశనానికి నాంది.. BBC న్యూస్

Posted: 10/27/2015 09:13 AM IST
Bbc news telecast a special story on ap capital amaravati

ఏపి కలల రాజధాని అమరావతి నిర్మాణానికి అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని హంగులతో అమరావతి నిర్మాణం జరగనుంది. అందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే అమరావతి గురించి జాతీయ మీడియాలోనే కాకుండా అంతర్జాతీయ మీడియాలో కూడా ఖచ్చితంగా కవరేజ్ ఉంటుందని అందరూ ఊహించారు. అయితే అంతర్జాతీయ మీడియాలో రారాజుగా పేరున్న బిబిసి ఛానల్ అమరావతి మీద ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. అమరావతి వరమా విషమా అంటూ కథనాన్ని వెలువరించింది.

అమరావతి మీద BBC ఛానల్ లో వచ్చిన పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

ఏపి రాజధానిగా కొత్త ఊపిరిపోసుకుంటున్న అమరావతి నిర్మాణం కోసం ఏపి ప్రభుత్వం, కేంద్రం చేస్తున్న తప్పులను బిబిసి తన కథనంలో నిలదీసింది. రాజధాని పేరుతో ఏపీ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని బీబీసీ కథనాన్ని వెలువరించింది. రాజధాని భూముల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. రాజధాని ప్రాంతంలో రైతులెవరూ గుమిగూడకుండా ఆంక్షలు విధించారని ప్రపంచానికి తెలియజేసింది. పోలీసులను ప్రయోగించి తమ భూములను ప్రభుత్వం లాక్కుందని పలువురు రైతులు చెప్పినట్టు వెల్లడించింది. చంద్రబాబు కేవలం వ్యాపారవేత్తలకు కొమ్ముకాస్తున్నారని రైతులు బీబీసీ దగ్గర వాపోయారు.

రాజధాని ప్రాంతంలో జరగనున్న ప్రకృతి విధ్వంసంపై బిబిసి ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే కొన్ని నెలల్లో రాజధాని పరిధిలో 10 మిలియన్లు అంటే కోటి చెట్లను నరికేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించిందని వెల్లడించింది. అమరావతిలో జరుగుతున్న తంతును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుపట్టిన అంశాన్ని కూడా ప్రస్తావించింది. రైతుల నుంచి సేకరించిన భూమే కాకుండా మరో 49 వేల 240 ఎకరాల అటవీభూమిని డీ నోటిఫై చేయాల్సిందిగా కేంద్రం ప్రభుత్వాన్ని కోరడాన్ని ప్రత్యేకంగా పేర్కొంది. ఇలా ఫారెస్ట్ ల్యాండ్‌ను తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయని, వాటిని పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పింది. తీసుకున్న అటవీ భూమికి రెండింతలు వేస్ట్ ల్యాండ్‌ను అటవీ శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. నరికే ఒక్కో చెట్టు స్థానంలో మూడుమొక్కలు నాటాల్సి ఉంటుంది. అయితే అలాంటి అటవీ నిబంధనలు అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కోటి చెట్లను నరికివేయడం అంటే అదో ప్రకృతి విపత్తేనని బీబీసీ కథనం చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles