ap cm chandrababu naidu has took long special class to his party ministers on ego problems | amaravati city | ap capital city

Chandrababu naidu special class to his party ministers on ego problems

chandrababu naidu, chandrababu updates, chandrababu party meetings, tdp party ministers, amaravati master plan, telangana cm kcr, kcr controversies, chandrababu controversies

chandrababu naidu special class to his party ministers on ego problems : ap cm chandrababu naidu has took long special class to his party ministers on ego problems.

‘కేసీఆర్ చిన్నోడైనా.. ఇంటికెళ్లి పిలిచానుగా’?

Posted: 10/27/2015 11:02 AM IST
Chandrababu naidu special class to his party ministers on ego problems

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే.. అందుకు ఇతరుల సహాయం తప్పనిసరి కాబట్టి తానున్న స్థాయికి ఏమాత్రం అహంకారం చూపకుండా అందరితోనూ కలిసిపోతున్నారు. అంతెందుకు.. తనకంటే చిన్నవాడైనా కేసీఆర్ తన వాక్చాతుర్యంతో తీవ్ర విమర్శలు గుప్పించినప్పటికీ.. ఆయనతో ఇప్పుడు స్నేహం పెంచుకున్నారు. అలాగే.. తమ రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరారు కూడా.

రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల అనుభవం వుండడంతోపాటు సీఎం హోదాలో వున్న ఆయన.. ఏమాత్రం అహంకారభావంతో మెలగకుండా స్నేహాపూర్వకమైన హస్తాన్ని చాచుతున్నారు. కానీ.. బాబు సహకారంతో టీడీపీలో మంత్రులుగా వెలుగుతున్న కొందరు నేతలు మాత్రం తమకున్న హోదాను చూసుకుని అహంకారం ప్రదర్శిస్తున్నారట. పైగా.. నవ్యాంధ్ర రాజధాని పరిధిలో వున్న భూములు అమాంతం పెరిగిపోవడంతో.. టీడీపీకి చెందిన ఆ ప్రాంత నేతల్లో క్రమంగా అహంకారం పెరుగుతోందట. ఈ విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు.. నష్టనివారణ చర్యలు ప్రారంభించారని సమాచారం. ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన ప్రతి నేతకు ‘అహంకారం’పై క్లాసులు పీకుతున్నారట. అహంకారం పెరిగితే పార్టీకి తీరని నష్టం కలుగుతుందని... దానిని నివారించాలంటే ముందుగా అహంకారాన్ని ఆమడదూరంలో ఉంచాలని బాబు తన పార్టీ నేతలకు ఉద్బోధిస్తున్నారు.

సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలోనూ ఆయన ఈ తరహా క్లాసొకటి పీకారు. ‘‘మీ భూముల ధరలు ఇప్పటికే బాగా పెరిగాయి. కొంతమంది పార్టీ నేతలకు అహంకారం పెరిగిపోతోంది. మీ అహాలు తగ్గించుకొని అందరినీ కలుపుకెళ్లండి. కేసీఆర్ నాకంటే జూనియర్. ఎన్ని సమస్యలున్నా ఆయన ఇంటికి వెళ్లి నేరుగా నేనే శంకుస్థాపనకు రావలసిందిగా ఆహ్వానించి వచ్చా. అహంకారం తగ్గితే వ్యక్తిగతంగా మీకూ మంచిదే’’ అని చంద్రబాబు ఇచ్చిన సుదీర్ఘ క్లాస్ తో నేతలు ఆలోచనలో పడ్డారట.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  kcr  amaravati  

Other Articles