Indian gangster Chhota Rajan arrested in Bali, says report; others say it's serial killer 'Cyanide Mohan'

Indian gangster chhota rajan arrested in bali

arrested, Bali, Chota Rajan, indonesia Police, Rajendra Nikalje, Mohan Kumar, Cyanide Mohan, Rajendra Sadashiv Nikalje, Bali police spokesman Heri Wiyanto,

Indonesian police officials said that they have arrested a wanted criminal from India in Bali, whether it was gangster Chhota Rajan, or serial killer Mohan Kumar better known as 'Cyanide Mohan'.

ఇండియన్ మోస్ట్ వాంటెడ్ చోటా రాజన్ అరెస్ట్.. బాలీలో అరెస్టు చేసిన

Posted: 10/26/2015 01:50 PM IST
Indian gangster chhota rajan arrested in bali

భారత మోస్ట్ వాంటెడ్ జాబితాలో వున్న మాఫియా డాన్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ముఖ్యఅనుచరుడైన చోటారాజన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కి అరెస్టయ్యాడు. ఇండోనేషియాలోని బాలిలో అతడిని ఇంటర్ పోల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చోటా రాజన్ పై ఇప్పటికీ భారత్ ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో అతడ్ని బాలీలో అదుపులోకి తీసుకున్నట్లు ఇ:డోనేషియా పోలీసులు తెలిపారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం మేరకు ఇంటర్ పోల్ వర్గాలు బాలిలో అరెస్టు చేశాయి.

55 ఏళ్ల రాజన్ 1995 నుంచి పరారీలో ఉన్నాడు. ఇప్పటికీ ముంబైలో జరుగుతున్న పలు ఘటనలలో అతని హస్తం ఉందని చెబుతుంటారు. తాజాగా కూడా ఓ వ్యాపారిని డబ్బులివ్వాలని బెదిరించడంతో పాటు అతను మాట వినలేదని తన ముఠా సభ్యులతో కాల్పులు కూడా జరిపించాడు. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహిత సహచరుడైన రాజన్... తరువాత అతనికే గట్టి ప్రత్యర్థిగా మారాడు. ముంబై పోలీసులు, భారత నిఘా ఏజెన్సీలు దాదాపు రెండు దశాబ్దాల నుంచి అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆస్ట్రేలియా పోలీసులు ఇచ్చిన సమాచారంతో చోటా రాజన్ ను పట్టుకున్నారు.

ఆస్ట్రేలియా పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారంతో తాము ఓ వ్యక్తిని అరెస్టు చేశామని. ఇండియాలో జరిగిన 20 హత్యలతో అతనికి సంబంధముందని, అతని కోసం 1995 నుంచి ఇంటర్ పోల్ వెతుకుతోందని తెలిసి ఆశ్చర్యపోయామని.. అతను మారెవరో కాదు రాజేంద్ర సదాశివ్ నికల్జీ అని ఇండోనేషియా పోలీసుల అధికార ప్రతినిధి హెరీ వెయాంటో తెలిపారు. ఈ మేరకు భారత పోలీసు అధికారులకు ఇండోనేషియా నుంచి సమాచారం అందగానే, ముంబై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజేంద్ర సదాశివ్ నికల్జీ పేరు వినగానే, అతను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఒకప్పటి ప్రధాన అనుచరుడు చోటా రాజన్ గా అనుమానించారు. ఆ వెంటనే పట్టుబడింది చోటా రాజన్ అని ఖరారు చేసుకున్నారు.

దాదాపు 20 సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్న చోటా రాజన్... ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియాకు విమానంలో వచ్చారు. విమానాశ్రాయంలో దిగి దిగగానే అతనిని ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, దావూద్ ఇబ్రహీం నుంచి రాజన్ విడిపోయి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత ఇరు వర్గాల మధ్య చాలా గొడవలు నడిచాయి. ఆ నేపథ్యంలోనే దావూద్ గ్యాంగ్ సభ్యుడొకడు చోటా రాజన్‌ కు సంబంధించిన సమాచారం ఆస్ట్రేలియన్ పోలీసులకు అందించి ఉండవచ్చని భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా చోటా రాజన్ ను ఇండియాకు అప్పగించే అవకాశాలున్నాయని ఇంటర్ పోల్ అధికారులు వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chota Rajan  indonesia Police  Bali  Rajendra Nikalje  

Other Articles