narayana college warden vemula vishnu suicide case create controversy | love affairs | college management

Warden vemula vishnu suicide in narayana college love affair

college suicide mysteries, vemula vishnu suicide, vemula vishnu narayana college, college warden suicide, college warden vishnu suicide

warden vemula vishnu suicide in narayana college love affair : narayana college warden vemula vishnu suicide case create controversy.

ఆ కాలేజీలో మరో ఆత్మహత్య.. కారణాలు రెండు!

Posted: 10/26/2015 11:38 AM IST
Warden vemula vishnu suicide in narayana college love affair

కాలేజీల్లో ఆత్మహత్యల పరంపర ఇంకా కొనసాగుతూనే వుంది. గతకొన్నాళ్ల నుంచి కాస్త చల్లబడ్డ ఈ వ్యవహారాలు తగ్గిపోయాయి అనుకుంటే.. ఇంతలోనే ఓ కాలేజీలో వార్డెన్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తాజాగా అత్తాపూర్ హైదర్‌గూడ నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఓ వార్డెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. తమదైన రీతిలో విచారణ చేపట్టి అతని ఆత్మహత్య కారణం ప్రేమ వ్యవహారమని అనుమానిస్తున్నారు. కానీ.. తోటి ఉద్యోగులు మాత్రం యాజమాన్యం వేధింపుల కారణంగా అతగాడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదర్‌గూడలోని నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో వరంగల్ జిల్లా కొత్తగూడకు చెందిన వేముల విష్ణు(27) రెండేళ్లుగా వార్డెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అందరితోనూ సౌఖ్యంగానే వుంటూ, తన పని తాను నిర్వర్తిస్తుండేవాడు. కాగా, శనివారం రాత్రి ఎవరూ లేని సమయంలో కళాశాలలోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం గమనించిన సిబ్బంది... విషయాన్ని కళాశాల నిర్వాహకులు, పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విష్ణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఫేస్‌బుక్ అక్కౌంట్‌ను పరిశీలించిన పోలీసులు... ‘దిస్ ఈజ్ లాస్ట్ డే.. బాయ్ స్వాతి’ అనే పోస్టును గుర్తించారు. దీన్నిబట్టి అతడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమనే నిర్ధారణకు వచ్చారు.

కానీ.. తోటి ఉద్యోగుల వాదన మరోలా వుంది. దసరా సెలవుల్లో కూడా పనిభారం మోపి యాజమాన్యం ఒత్తిడి తేవడం వల్లే విష్ణు ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలియగానే... ఆ కళాశాలలో ఉండే సిబ్బంది వెళ్లిపోయి వారి స్థానంలో వేరే బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగులు విధుల్లోకి రావడం, ఇంత జరిగినా ప్రిన్సిపాల్ కాలేజీకి రాకపోవడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : college warden vishnu suicide  college suicide mysteries  

Other Articles