Additional DGP Tagore takeover kruparani case

Additional dgp tagore takeover kruparani case

Kruparani case, AP govt, Additional DGP, Tagore, Chandrababu Naidu

Additional DGP Tagore takeover kruparani case. AP govt very serious on kruparani suicide case. AP govt handover the kruparani case to aditional DGP Tagoor.

ఠాగూర్ చేతికి కృపామణి కేసు

Posted: 10/26/2015 11:30 AM IST
Additional dgp tagore takeover kruparani case

నా ఆత్మహత్యకు నా తల్లిదండ్రులు, నా తమ్మడు కారణం అంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేసి సంచనం రేపిన కృపామణి కేసు కీలక మలుపు తిరిగింది. అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న కృపామణి కేసును ఏపి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. తల్లిదండ్రుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న కృపారాణి కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వ్యభిచారం చేయాలంటూ తల్లిదండ్రులు, తమ్ముడు సహా రౌడీషీటర్ శ్రీనివాస్ వేధింపులకు గురిచేయడంపై బాధితురాలు సెల్ఫీ వీడియోలో స్వయంగా చెప్పిన ఘటన కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకునే ముందు జిల్లా ఎస్పీని కలిసేందుకు కృపామణి యత్నించింది. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

అప్పటినుంచి పేరెంట్స్, రౌడీషీటర్ వేధింపులు మరింత ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకుంది. నిందితులపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ కేసుని దర్యాప్తు చేసేందుకు అడిషనల్ డీజీపీ ఠాగూర్ స్వయంగా రంగంలోకి దిగారు....పరారీలో ఉన్న నిందితుల్ని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తణుకు, భీమవరం, హైదరాబాద్, విశాఖపట్నంలో గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితుల్ని అదుపులోకి తీసుకుంటామని, కృపామణిని వేధింపులకు గురిచేసినట్టు ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kruparani case  AP govt  Additional DGP  Tagore  Chandrababu Naidu  

Other Articles