Bride refuses to marry drunk groom

Bride refuses to marry drunk groom

Tamilnadu, Bride, Bridegroom, Marriage, To Marry drunk groom

A bride in Tamilnadu has refused to marry a groom who reached the marriage venue in an inebriated condition . In fact he was not even able to walk properly.

మందు కొట్టి.. తాళి కట్టాడు. ఛీకొట్టి వెళ్లిపోయిన పెళ్లి కూతురు

Posted: 10/24/2015 11:20 AM IST
Bride refuses to marry drunk groom

సాయంత్రానికి పెళ్లి..సంబరాల్లో మునిగిపోయిన మిత్రులతో కలిసి వరుడు మధ్యాహ్నం దాకా ఫుల్లుగా మందేశాడు. పెగ్గు మీద పెగ్గులు ...అలా గంటల తరబడి ఆ వరుడు మందేస్తూనే ఉన్నాడు. తీరా పెళ్లి గడియల రానే వచ్చాయి. అప్పటికింకా అతడి నుంచి మందు వాసన వస్తూనే ఉంది. ఐతే, చక్కగా స్నానం చేసి పెళ్లి బట్టలు కట్టుకుని, ఒళ్లంతా సెంటు కొట్టుకుని అతడు పెళ్లి పీటలు ఎక్కాడు. పెళ్లి కూతురు మెడలో తాలి కూడా కట్టేశాడు.

మందు కంపును పసిగట్టిన వధువు, షాక్ తింది. ముందుబాబుతో కలిసి ఏడడుగులు నడవడమే కాదు కదా, కూడా పంచుకోలేనని తేల్చి చెప్పింది. దీంతో అప్పటికీ ఇంకా నిషాలోనే ఉన్న వరుడు మెడలో ఉన్న దండలు తీసేసి ఆమెతో మండపంలోనే వాగ్వాదానికి దిగాడు. వరుడి మందు మాటలతో చిర్రెత్తుకొచ్చిన వధువు తన తల్లితో కలిసి నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని తేని జిల్లా బోడినాయకనల్లూరు సమీపంలోని వీరపాండిలో ఈ ఘటన జరిగింది. ఉదూర్ కు చెందిన సౌందర్య అనే యువతి, మందు కొట్టి తన మెడలో తాళి కట్టిన సెల్వ పాండియన్ తో పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamilnadu  Bride  Bridegroom  Marriage  To Marry drunk groom  

Other Articles