Amaravati roti is the special attraction in Rottela Panduga

Amaravati roti is the special attraction in the nellore rottela panduga

Amaravati Roti, Rottela Panduga, Nellore, Barashahi Darga, Nellore Rottela Panduga, Roti Festival

Amaravati roti is the special attraction in the nellore Rottela Panduga. Many youths seeking software jobs and visas were seen buying the roti from the stall. Special hoardings were erected with the titles ‘Videsiyana roti’, ‘Arogya roti’ and so on near the Swarnala Cheruvu where the pilgrims came to have a sacred bath. Students and professionals having plans to go abroad exchanged rotis at the ‘Videsiyana roti’ point.

అమరావతి రొట్టె.. చాలా హాట్ హాట్

Posted: 10/24/2015 09:02 AM IST
Amaravati roti is the special attraction in the nellore rottela panduga

ఆ మధ్య ఎన్నికల్లో మోదీ చీరలు.. మోదీ స్వీట్లు.. మోదీ చొక్కాలు.. మోదీ చాయ్ ఇలా రకరకాల వస్తువులు మార్కెట్ లోకి వచ్చాయి. అవి విపరీతంగా సేల్ కూడా అయ్యాయి. అయితే తెలుగు నాట మాత్రం ఇప్పటి దాకా ఇలాంటి విపరీతాలు జరగలేదు. కానీ తాజాగా ఏపి రాజధాని అమరావతి ఫీవర్ వల్ల అది కూడా వచ్చేసింది. ఆంధ్రుల కొత్త చరిత్రకు నాంది పలికిన అమరావతి శంకుస్థాపన ముగిసిన తర్వాత అమరావతి పేరుతో రొట్టెలు వచ్చేశాయి. రొట్టెలు వచ్చాయ్ అనగానే.. ఎక్కడ దొరుకుతాయి..? రుచి బాగా ఉన్నాయా..? అనే అనుమానం వస్తుందేమో కానీ ఇవి మీరనుకుంటున్నట్లుగా ఏ రెస్టారెంట్లోనో దొరికే రొట్టెలు కాదు.

అమరావతి రొట్టెల సీజన్ నడుస్తోంది. అమరావతి రొట్టెల ఫీవర్ లో నెల్లూరు జిల్లా మొహర్రం నాడు జరిగే రొట్టెల పండుగలో నడుస్తున్న నయా ట్రెండ్. నెల్లూరు నగర శివారులోని బారా షాహిద్ దర్గా సమీపంలోని చెరువు వద్ద ప్రారంభమైన రొట్టెల పండుగలో ఈసారి అమరావతి రొట్టె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇప్పటి వరకు పెళ్లి రొట్టె, ఉద్యోగం రొట్టె, ఆరోగ్యం రొట్టె ఎంతో ఫేమస్ కాగా తాజాగా అమరావతి రొట్టె కూడా సందడి చేస్తోంది. మొత్తానికి ఆంధ్రుల రాజధాని అమరావతి పేరుతో బారా షామిద్ దర్గా సమీపంలో రొట్టెల సందడి మొదలైంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles