narendra modi reaches gannavaram airport

Pm modi arrives at gannavaram airport

ap capital amaravati, amaravathi land breaking occasion, pm narendra modi amaravathi foundation, chandrababu amaravathi foundation occassion, kcr amaravathi, governor narasinhan, venkaiah naidu, ap ministers, union ministers, amaravathi invitees, sai kumar, sunitha, shivamani drums, sai kumar sunitha welcome amaravati invitees, photo gallary, governers, ministers, nirmala sitaraman, gannavaram airport, VIPs, ap capital, amaravathi

Prime minister Narendra damodar modi reaches to gannavaram airport

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ.!

Posted: 10/22/2015 11:52 AM IST
Pm modi arrives at gannavaram airport

నవ్యాంధ్ర రాజధాని, నవశకపు రాజధాని అమరావతికి అంకురార్పణ చేయనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు స్వాగతం పలికారు. చంద్రబాబు ఈ సందర్భంగా ప్రధానిని పట్టు శాలువాతో సత్కరించారు. కాగా ప్రధాని నిర్ణీత సమయం కంటే పది నిమిషాలు ముందే గన్నవరం వచ్చారు.

అనంతరం  ప్రధాని మోదీ గన్నవరం నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో అమరావతికి బయలుదేరారు. మధ్యాహ్నం 12.20 గంటలకు అమరావతి హెలిప్యాడ్‌కు చేరుకొని.. రోడ్డుమార్గంలో రాజధాని శంకుస్థాపన వేదిక అయిన ఉద్ధండరాయుని పాలెం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.45 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మోదీ తిరుపతి వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prime minister  narendra modi  amaravati  gannavaram airport  

Other Articles