heavy competition for bars, 2100 applications for 130 bars

Applications pour in for bar and restaurants licence

telangana bar and restaurants, bar competition in telangana, heavy competition for bars in telangana, Panchayatis, ramagundam corporation, excise department, bar and restaurants, GHMC 557 bars, nizambad 11 bars, ramagundam 8 bars, 21 major panchayats 30 bars, 20 municipalities 29 bars

heavy competition for bars and restaurants in telangana as 2100 number of applications poured in for 130 bars

రాష్ట్రానికి ఆదాయం గనగన.. తాగుబోతంటే ఎందుకంత చులకన..!

Posted: 10/21/2015 10:56 AM IST
Applications pour in for bar and restaurants licence

రాష్ట్ర ఖజానాను నింపుకునే పనిలో ఈ ఏడాది నుంచి రెండేళ్ల పాటు కొనసాగనున్న మధ్యం దుకాణాలకు లైన్సులు జారీ చేసే ప్రక్రియ పూర్తి కావడంతో ప్రభుత్వం మరో ఆదాయ వనురుగా మారిన బార్ అండ్ రెస్టారెంట్ ల లైసెన్సులపై దృష్టి సారిందింది. దీంతో బార్ లైసెన్సులకు కొత్తగా ధరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ పిలువగా, విపరీతమైన పోటీ ఏర్పడింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీల్లో బార్ల ఏర్పాటుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. జీహెచ్‌ఎంసీ, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లు సహా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కొత్తగా 130 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

కాగా 2,100 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేయనున్న 60 బార్లకు దాదాపు 200 దరఖాస్తులురాగా, మిగతా 70 బార్ల కోసం ఏకంగా 1,900 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హతగల దరఖాస్తులను ఎంపిక చేసే పనిలో సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో గత జూన్ వరకు 756 బార్లు ఉండగా జనాభా ప్రాతిపదికన బార్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి 13 వేల జనాభాకు, జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రతి 30 వేల జనాభాకు ఒక బార్ చొప్పున ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది.
 
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పుడున్న 497 బార్లకుగాను మరో 60 అదనంగా ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో ప్రస్తుతం 7 బార్లు ఉండగా కొత్తగా మరో 4 ఏర్పాటు కానున్నాయి. అలాగే రామగుండం కార్పొరేషన్‌లో ప్రస్తుతమున్న 6 బార్లను 8కి పెంచనున్నారు. 21 నగర పంచాయతీల్లో 30 బార్లు, 20 మున్సిపాలిటీల్లో కొత్తగా 29 బార్లు ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. నగర పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీల్లో బార్లకు అవకాశం ఇవ్వడంతో స్థానికంగా ఉండే లాడ్జింగ్‌లు, రెస్టారెంట్లు, రిటైల్ మద్యం దుకాణాల యజమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panchayatis  ramagundam corporation  excise department  bar and restaurants  

Other Articles