With wedding cancelled, bride throws feast for homeless, goes on honeymoon with her mother

California family turns cancelled wedding into giving opportunity

Cancelled wedding, Cancelled wedding feast homeless, Kari Duane, Landon Borup, Next Move community organisation, Quinn Duane, Shareworthy, Bride , honeymoon , honeymoon with mother, California family cancelled wedding, California family giving opportunity

After a California couple’s wedding got cancelled, the bride-to-be's family decided to turn the extravagant $35,000 event into a feast for the homeless.

ITEMVIDEOS: అమెరికాలో నిజమైన బాలీవుడ్ చిత్రకథ.. అమె మంచితనం అభినందనీయం..!

Posted: 10/20/2015 08:37 PM IST
California family turns cancelled wedding into giving opportunity

బాలీవుడ్ వ్యాపంగా పెను సంచలనంగా నిలిచిన చిత్రం.. అవార్డుల పంట పండించుకున్న చిత్రం గుర్తుందా ..? నటి కంగనా రనౌత్ నటించిన చిత్రం క్వీన్ ను తలపించేలా అమెరికాలో ఓ ఘటన చోటుచేసుకుంది. యూనైటెడ్ స్టేట్స్‌లోని కాలిఫోర్నియాలో క్విన్ డ్యూన్(27), లాన్‌డన్ బోరప్(27)లు గడిచిన శనివారం నాడు వివాహం చేసుకో నిశ్చయించారు. స్థానికంగా ఉన్న ప్రముఖ సిటిజన్ హోటల్‌లో వివాహ వేడుక. వివాహా ఆర్డర్లన్నీ ఇచ్చేశారు. చాలా వరకు డబ్బులు తిరిగి ఇవ్వనివే. వేడుక ఏర్పాట్లకు దాదాపు రూ. 23 లక్షలు ఖర్చు అయింది.

కాగా వివాహం వారం రోజులు ఉందనగా పెళ్లికొడుకు ఉన్నట్లుండి పెళ్ళిని రద్దు చేసుకున్నాడు. అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హాల్ బుకింగ్, పూల అలంకరణలు, ఆహార పదార్ధాల ఆర్డర్లు వంటి పలు ఘట్టాలు పూర్తైయ్యాయి. దీంతో పెళ్లికూతురు ఒక్కసారిగా నిశ్చేష్ఠురాలైంది. చిన్నగా తేరుకుని డబ్బులు తిరిగిరావు కావునా తదుపరి కార్యచరణకు ఉపక్రమించింది. తన తల్లిని పిలిచి తాను తీసుకోబోయే చర్య గురించి వివరించింది. ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి తన వివాహ వేడుక ఖర్చును ఏవిధంగా సద్వినియోగం చేయదలచుకుందో తెలిపింది.

కమ్యూనిటీ సంస్థ పెళ్లి విందుపై ప్రచారం చేసింది. ఇళ్లులేని వాళ్లు. ఒంటరివాళ్లు, వృద్ధులు, పసిపిల్లలతో కూడిన సమూహాన్ని విందుకు ఆహ్వానించారు. వాళ్లంతా ఆనందంగా ఆరగించి తృప్తిగా వెళ్లిపోయారు. దీనిపై పెళ్లికూతురు అమ్మ స్పందిస్తూ.. మా కూతురుకు ఇలా జరగటం ఎంతో బాధ కలిగించింది. చెడు పరిస్థితుల్లో కూడా మంచిగా ఆలోచించడం మాఅందరి హృదయాలకు హత్తుకుందని పేర్కొంది. బెలిజీలో హనీమూన్ కోసం బుక్‌చేసిన నగదు కూడా తిరిగి ఇవ్వరు. కావునా పెళ్లికూతురు వాళ్ల అమ్మతో కలిసి ప్రకృతిని ఆస్వాదించడానికి హనీమూన్‌కు వెళ్లింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bride  honeymoon  honeymoon with mother  Quinn Duane  California family  

Other Articles