Clashes between the main priests in tirumala

Clashes between the main priests in tirumala

Tirumala, Tirupati, Lord Venkateshwara, Ramana Deekshithulu, Venugopal Deekshithulu, Brahmosthavalu

The clashes between the priests in tirumala tirupati temple place peaks. In Brahmostavalu, Ramanaseekshithulu in the service of Venkateshwara at Suryaprabha Vahanam.

తిరుమల ఆలయ అర్చకుల మధ్య గొడవ

Posted: 10/20/2015 11:15 AM IST
Clashes between the main priests in tirumala

తిరుమల తిరుపతిలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుండి భక్తులు తరలివచ్చారు. కనుల పండుగగా సాగే.. బ్రహ్మోత్సవాలను కనులారా చూసితరించాలని వచ్చిన వారికి అర్చకుల మధ్య తగాదా కొత్తగా అనిపిస్తోంది. తిరుమల శ్రీవారి సేవలో ఉన్న అర్చకుల మధ్య గత కొంత కాలంగా సాగుతున్న వివాదాలు ఏకంగా బ్రహ్మోత్సవాల వేళ భక్తుల ముందే బయటపడ్డాయి. తిరుమల వచ్చే భక్తులు ఇప్పుడు బ్రహ్మోత్సవాల కన్నా అర్చకుల మధ్య జరుగుతున్న వివాదం గురించే మాట్లాడుతున్నారు. రమణదీక్షితులు, వేణుగోపాల్ దీక్షితులు మధ్య నడుస్తున్న వివాదంపై అటు భక్తులు ఇటు టిటిడి గుర్రుగా ఉన్నారు. కాగా తిరుమల దేశాలయంలో ప్రధానార్చకులుగా ఉన్న రమణ దీక్షితులు తన పంతాన్ని నెగ్గించుకున్నారు.

తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారిని రోజుకో రూపంలో వివిధ వాహనాల మీద ఊరేగించడం జరుగుతుంది. కాగా నేడు సూర్యప్రభ వాహనం మీద శ్రీవారు ఊరేగనున్నారు. సూర్యప్రభ వాహనం వద్ద ముందుగా వేణుగోపాల్ దీక్షితులకు డ్యూటీ వేసింది టిటిడి. కానీ చివరి నిమిషంలో మాత్రం ఆ డ్యూటీని రమణదీక్షితులు వత్తిడి మేరకు మార్చింది. దాంతో రమణదీక్షితులు, వేణుగోపాల్ దీక్షితులు మధ్య వాగ్వాదం జరిగింది. తిరుమల ప్రధానార్చకులుగా రమణ దీక్షితులు మాట నెగ్గింది. దాంతో అక్కడి నుండి వేణుగోపాల్ దీక్షితులు వెళ్లిపోయారు. కాగా వాహన సేవ ప్రారంభం కాగానే ప్రధానార్చకులు ప్రధానాలయంలో స్వామి వారి కైంకర్యాలను నిర్వహించడం జరుగుతుంది. కానీ రమణ దీక్షితులు సూర్యప్రభ వాహనం మీద స్వామి వారి సేవలో కనిపించడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. మొత్తానికి తిరుమలలో అర్చకుల మధ్య వాగ్దాదం భక్తులకు అసౌర్యాన్ని కలిగిస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles