Telangana KCR Amaravathi tour conformed

Telangana kcr amaravathi tour conformed

KCR, Chandrababu, KCR to Amaravati, Amaravati News, Chandrababu Naidu with KCR, KCR tour to Amaravati, Amaravati Guests, Amaravati Inauguration

Telangana cm KCR tour to new capital city of the ap. Chandrababu Naidu invited KCR for the inauguration of ap new capital Amaravati. KCR will attend the programmee.

కేసీఆర్ అమరావతి టూర్.. రెండు పనులు పూర్తి

Posted: 10/20/2015 10:42 AM IST
Telangana kcr amaravathi tour conformed

ఏపి రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సిఎం కేసీఆర్ ను చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి సాదరంగా ఆహ్వానించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఖచ్చితంగా రావాలని కేసీఆర్ ను చంద్రబాబు మరీమరీ కోరారని.. అందుకు కేసీఆర్ కూడా ఓకే అన్నారని.. వస్తాను అన్నా అని మాటిచ్చారని తెలిసింది. కాగా దసరా నాడు జరిగే ఈ కార్యక్రమానికి కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. శంకుస్థాపన కోసం కేసీఆర్ సూర్యాపేట నుంచి హెలికాప్టర్ లో రాజధాని ప్రాంతానికి వెళ్లనున్నారు. అంతే కాదు ఈ పర్యటనలోనే కేసీఆర్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి మొక్కు కూడా చెల్లించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అమరావతి శంకుస్థాపన వేడుకకు హాజరయ్యేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శంకుస్థాపనకు ఒక రోజు ముందే అంటే రేపు హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో గన్నవరం విమానాశ్రయానికి రావాలంటూ ఏపీ అధికారులు సూచించారు. మొదట్లో రోడ్డు మార్గంలోనే వెళ్లాలని కేసీఆర్ భావించినప్పటికి...రోడ్డు మార్గంలో విజయవాడకు ప్రయాణించడం సేఫ్ కాదని పోలీసులు సూచించారు. దీంతో సూర్యాపేట నుంచి హెలికాప్టర్ లో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి ప్రత్యేక హెలికాఫ్టర్ లో కేసీఆర్ ను తీసుకెళతామని ఏపీ అధికారులు ఇప్పటికే తెలంగాణ సీఎంఓకు సమాచారం అందించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని చూసుకోవడంతోపాటు మరోపనిని కూడా పూర్తి చెయ్యనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈసారి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముక్కు పుడక ఇచ్చే మొక్కు తీర్చుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే అమ్మవారికి ముక్కుపుడక సమర్పిస్తానని కేసీఆర్ అప్పట్లో మొక్కు కున్నారు. సుమారు పది నుంచి 15గ్రాముల బరువైన బంగారు ముక్కుపుడకను ఈ సందర్భంగా కేసీఆర్ అమ్మవారికి సమర్పించనున్నారు. కేసీఆర్ శంకుస్థాపనకు రానుండటంతో కేసీఆర్ తో పాటు ఆయన వెంట వచ్చే మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల కోసం ఏపీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఉద్దండరాయునిపాలెం వచ్చేందుకు తెలంగాణ అధికారులకు రూప్ మ్యాప్ లు అందజేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles