Andhra Chief Minister Chandrababu Naidu Meets Telangana Chief Minister KCR

Ap cm n chandrababu naidu invites kcr to capital function

Chandrababu meets KCR, Chandrababu invites KCR to Amaravati, Chandrababu Naidu, KCR, Andhra Pradesh, Telugu Desam Party, TDP, Telangana, TRS, Chandrasekhar Rao, Amaravati, capital foundation, invitation

Setting aside the bitterness in their relations due to cash-for-vote scam, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu today met his Telangana counterpart K. Chandrasekhar Rao to invite him for the foundation stone laying ceremony of the new state capital.

దసరాకు ముందే.. తెలుగు చంద్రుల అలాయ్ భలాయ్..

Posted: 10/18/2015 07:47 PM IST
Ap cm n chandrababu naidu invites kcr to capital function

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావును కలిశారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా చంద్రబాబు స్వయంగా కేసీఆర్ కు ఆహ్వానపత్రిక అందజేశారు. ఆహ్వానపత్రికతో పాటు తిరుపతి లడ్డును ప్రసాదంగా ఇచ్చారు. తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన చంద్రబాబును కేసీఆర్ సాదరంగా నివాసంలోకి ఆహ్వానించారు. చంద్రబాబు వెంట తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ ఉన్నారు.

ఇంటికి వచ్చిన చంద్రబాబుకు కేసీఆర్, మహ్మమూద్ అలి, జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ పుష్పగుచ్ఛాలిచ్చారు. అనంతరం చంద్రబాబు కేసీఆర్ కు షాలువా కప్పి పుఫ్పగుచ్చాన్ని అందించారు. ఆ తరువాత అమరావతికి కుటుంబసమేతంగా రావాలంటూ ఆహ్వాన పత్రిక అందించారు.దాదాపు 45 నిమిషాలపాటు కొనసాగిన చంద్రబాబు, కేసీఆర్ భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహబూబ్ అలీ, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి పాల్గొన్నారు.

దాదాపు ఎనిమిది నెలల తర్వాత చంద్రబాబు.. కేసీఆర్ను కలిశారు. ఓటుకు నోటు కేసు వెలుగుచూడటంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్, చంద్రబాబు కలుసుకోవడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 22న గుంటూరులో ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది.  ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువరు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పలువురు ప్రముఖులకు చంద్రబాబు స్వయంగా ఆహ్వానపత్రికలు అందజేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  KCR  Andhra Pradesh  Telugu Desam Party  TDP  Telangana  TRS  Chandrasekhar Rao  Amaravati  

Other Articles