Congress leaders target the media

Congress leaders target the media

Telangana, Congress, KCR, namasthetelangana, Tnews, Ponnam Prabhakar, farmers, Suicide, Telangana govt

Telangana congress party leaders targeted some media. Telangana congress leaders slams Namasthetelangana and TNews channels for not broadcasting farmers suicide news. Ponnam Parabhakar request to prohibiete the Namasthetelangana and Tnews channels.

కాంగ్రెస్ టార్గెట్ నమస్తే తెలంగాణ, టీన్యూస్

Posted: 10/17/2015 09:16 AM IST
Congress leaders target the media

ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టుంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి.. రైతుల ఆత్మహత్యల మీద భరోసా యాత్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సర్కార్ మీద, కేసీఆర్ మీద ఎంత వరకు వీలైతే అంత వరకు విమర్శలు చేశారు. కేసీఆర్ మంత్రి వర్గంలోని ప్రతి మంత్రిని పేరు పేరనా తిట్టారు. ఇక మీడియా మీద పడ్డారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణలో వస్తున్న నమస్తే తెలంగాణ, టీన్యూస్ ఛానల్స్ మీద వారు విమర్శలకు దిగారు. నమస్తే తెలంగాణ పత్రికలో రైతుల ఆత్మహత్యల గురించి ఎందుకు రాయడంలేదని  గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. పేజీలను కవిత వార్తలలతో నింపేస్తున్నారు. కవిత బతుకమ్మకు ఉన్న ప్రాధాన్యం... తెలంగాణలోని రైతు బతుకులకు లేదా?అని నిలదీశారు.

రాష్ట్రంలో రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే రాయని.. ప్రతిపక్షాల గొంతును వినిపించని నముసే తెలంగాణ పత్రికను, టీన్యూస్‌ల్‌ను కాంగ్రె్‌స కార్యకర్తలు ఎందుకు చదవాలి? ఎందుకు చూడాలి?’’ అని  పొనం ప్రభాకర్‌ ప్రశ్నించారా. అధికారపార్టీకి తొత్తుగా, కపత్రంగా ెన్న నమసే తెలంగాణ, టీన్యూస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. నమస్తే తెలంగాణ చదవొద్దని, టీన్యూస్‌ చూడొద్దని కార్యకర్తల చప్పట్లే రిఫడెండమ్‌గా ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్సందిస్తూ.. ఆ పత్రిక, ఛానల్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Congress  KCR  namasthetelangana  Tnews  Ponnam Prabhakar  farmers  Suicide  Telangana govt  

Other Articles