Jayalalitha gave shock to chandrababu

Jayalalitha gave shock to chandrababu

Chandrababu Naidu, Amaravati, Jayalalitha, Ap, Amaravati, inauguration, Invitation

Tamilnadu cm Jayalalitha gave shock to chandrababu. Chandrababu Naidu sent invitation to Amaravati inauguration ceremony. But Jayalalitha not intersted and also she siad that ap govt has to release the tamil sandalwood coolis.

చంద్రబాబుకు ‘జయలలిత షాక్’

Posted: 10/17/2015 08:58 AM IST
Jayalalitha gave shock to chandrababu

ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఝలక్‌ ఇచ్చినట్లు సమా చారం. తమ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కార్యక్ర మానికి గౌరవ అతిథిగా హాజరుకా వాల్సిందిగా జయలలితను చంద్రబాబు ఆహ్వానించారు. దీనికి ఆమె ప్రతిస్పందిస్తూ... 'ఆంధ్రా జైలులో ఉన్న తమ రాష్ట్రానికి చెందిన 516 మంది ఎర్ర చందనం కూలీలను విడిచిపెడితేనే వస్తాను' అని షరతు పెడుతూ ఎపి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈనెల 22న జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులను, విదేశీయులనూ ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆహ్వానించిన విషయం తెలిసిందే.

అమరావతి శంఖుస్థాపనకు ఏపి ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తోంది. ఎంతో మంది ప్రముఖులకు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానాలు పంపుతోంది ఏపి ప్రభుత్వం. ఆ ఆహ్వా నంలో భాగంగానే జయలలిత పై విధంగా స్పందించడంతో చంద్ర బాబు అవాక్కయి నట్లు తెలిసింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గత కొన్ని నెలల క్రితం శేషా చలం అడవుల్లో తమిళనా డుకు చెందిన 20 మంది కూలీలను పోలీసులు కాల్చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాల్లోనూ దుమారం రేగింది. చంద్రబాబుపై తమిళనాడు ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయి ఆందోళనలకు దిగిన ఘటనలున్నాయి. ఒకవేళ చంద్రబాబు ఆహ్వానం మేరకు శంకుస్థాపన కార్యక్రమానికి జయలలిత వస్తే.. ఎక్కడ రాష్ట్ర ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమోనన్న సందేహంతో బాబుకు షరతులతో కూడిన లేఖ రాసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Amaravati  Jayalalitha  Ap  Amaravati  inauguration  Invitation  

Other Articles