Jagan clear that he dont come to Amaravati inaguration ceremony

Original reason on jagans absent on amaravati

Jagan Mohan Reddy, Jagan, Amaravati, Amaravati Inauguration, jagan On Amaravati, jagan on Amaravati inauguration, jagan Letter to chandrababu, Jagan on Amaravati land pooling, jagan News, Jagan fasting, jagan protest, Jagan on Amaravati invitation

Jagan Mohan reddy wrote open letter to AP cm Chandrababu Naidu that dont invite him. Jagan describe eight points in his open letter. Actual reasons are diffrent.

జగన్ అమరావతికి ఎందుకు రారు..? అసలు కారణాలు ఇవి..

Posted: 10/16/2015 10:35 AM IST
Original reason on jagans absent on amaravati

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు ఓపెన్ లెటర్ రాశారు. ఏడు రోజుల దీక్ష తర్వాత రాసిన ఓపెన్ లెటర్ మీద సర్వత్రా చర్చసాగుతోంది. జగన్ చంద్రబాబు నాయుడుకు రాసిన లెటర్ లో ఎనిమిది కారణాలను వివరిస్తూ. వాటి వల్లనే తాను అమరావతి శంఖుస్థాపనకు రావడం లేదని. తనకు ఆహ్వానం కూడా అందించకండి అంటూ వివరించారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఇలా వ్యవహరించడానికి కారణాలు ఏంటి..? దేశ విదేశాల ప్రముఖులు అందరూ వస్తుంటే జగన్ మాత్రం ఎందుకు రారు...? జగన్ ఆంధ్రుల జీవితాల్లో అతి ముఖ్యమైన ఘట్టానికి రాకుండా ఉండడానికి కారణాలు ఏంటి..? మోదీ, సింగపూర్ ప్రధాని, జపాన్ కు చెందిన ప్రముఖులు, దాదాపు 20 వేల మంది వస్తున్న కార్యక్రమానికి జగన్ మాత్రం ఎందుకు రారు..? అమరావతి అద్భుత ఘట్టానికి శ్రీకారం చుడుతున్న వేళ జగన్ రాసిన ఓపెన్ లెటర్ రాజకీయ ప్రముఖులకు కొత్తగా అనిపిస్తోంది.

వైసీపీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఏపిలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆ పార్టీకి ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేకున్నా ప్రజాధరణ మాత్రం ఉంది. ఓటు శాతంలో స్వల్ప తేడాతో టిడిపి కంటే వెనుకబడింది వైసీపీ. మరి ఏపిలో ఎంతో ఓట్లను మూటగట్టుకున్న జగన్ ఇలా ప్రజా రాజధాని శంఖుస్థాపనకు రాకుండా ఉంటే ఎలా..? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు..? రాజకీయ కారణాల వల్ల జగన్ ఇలా చేస్తున్నార..? లేదంటే పర్సనల్ గా ఏవైనా కారణాలు ఉన్నాయా..? ఇలా అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్నలు. చంద్రబాబు నాయుడు ఏపి ముఖ్యమంత్రి హోదాలో అందరికి ఆహ్వాన పత్రికలు పంచుతున్నారు. మోదీ దగ్గరి నుండి రైతుల వరకు అందరికి అమరావతి అద్భుత ఘట్టంలో పాలుపంచుకోవాలని కోరుతున్నారు. నిజానికి జగన్ కు ఇంకా ఆహ్వానం అందనే లేదు.. కానీ అంతలోనే జగన్ తనకు ఆహ్వానం పంపకండి. పంపినా రాను అంటూ లెటర్ రాశారు.

జగన్ మోహన్ రెడ్డి తన ఓపెన్ లెటర్ లో ఎనిమిది కారణాలను చూపుతూ... తాను అమరావతి శంఖుస్థాపనకు రావడం లేదు అని వివరించారు. కానీ నిజానికి జగన్ చెప్పిన కారణాల్లో ఏ ఒక్కటి కూడా సహేతుకంగా లేవు. రైతుల నుండి బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చేశారని.. రైతుల ఉసురుతీసిన రాజధాని శంఖుస్థాపనకు తాను రానని అన్నారు. కానీ అలా జరగనేలేదు.. ల్యాండ్ పూలింగ్ నిర్ణయం తీసుకున్నా తర్వాత మాత్రం దాన్ని విరమించుకుంది ఏపి ప్రభుత్వం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపి ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో వెనక్కి తగ్గింది. చివరకు ఎలాంటి పూలింగ్ ఆదేశాలు లేకుండానే భూమిని సేకరించారు. ఇలా జగన్ చెప్పిన ప్రతి కారణానికి ఇలా  అసంబద్దమైన నిజాలు ఉన్నాయి. కానీ జగన్ మాత్రం వాటిని సాకుగా చూపి అమరావతి అద్భుత ఘట్టానికి డుమ్మా కొట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.

నిజానికి ఏం జరగింది అంటే.. జగన్ ఏపికి ప్రత్యేక హోదా కోసం ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. కానీ జనాల్లోకి జగన్ దీక్ష అంతలా వెళ్లలేదు. దాంతో జగన్ వర్గానికి చెందిన వారు కూడా నిరుత్సాహపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్ష చేస్తే.. ఉద్యమానికి, కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడింది. జగన్ దీక్ష చేస్తున్న సమయంలో చాలా మంది జగన్ ను కేసీఆర్ ను పోల్చారు. కానీ కేసీఆర్ కు వచ్చిన స్పందన జగన్ దీక్షలో కనిపించలేదు. ముఖ్యంగా మీడియాలో కూడా పెద్దగా వార్తలు రాకపోవడం జగన్ వర్గానికి తీవ్ర నిరాశను మిగిల్చింది. దాంతో అమర్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ జగన్ దీక్ష మీద మీడియా పక్షపాత వైఖరిని అవలంబిస్తోంది అని అన్నారు.

చంద్రబాబు నాయుడుకు తెలిసినంతలా మీడియా మేనేజ్ మెంట్ ఎవరికి తెలియదు అన్నది జగమెరిగిన సత్యం.. కొత్తగా జగనెరిగిన సత్యం కూడా. మరి అమరావతికి జగన్ వెళ్లినా మీడియా మొత్తం దృష్టిని చంద్రబాబు నాయుడు మీద, మోదీ మీద ఉంచుతుంది. ఫలితంగా జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి జగన్ మీడియా దృష్టితో అమరావతి శంఖుస్థాపనకు రావడానికి ఇష్టపడకపోవచ్చు. ఇక అమరావతి శంఖుస్థాపనకు వచ్చే వారిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి అక్కడికి జగన్ వెళ్లినా కానీ అక్కడి తెలుగు తమ్ముళ్లు జగన్ రాకను ప్రతిఘటించవచ్చు లేదంటే... జగన్ కు అనుకోని చేదు అనుభవం కూడా ఎదురుకావచ్చు కాబట్టి జగన్ ఇలా నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.

ఇక ఏపి ప్రజల ఆకాంక్షల కలల రూపం.. అమరావతి శంఖుస్థాపన మీద ఎంతో మంది ఆశగా ఉన్నారు. తమ రాజధాని నిర్మాణానికి దసరా రోజున శ్రీకారం చుడుతుండటం అందరికి సంతోషం కలిగించే అంశం. మరి ఆంధ్రులు ఎంతో గర్వించే క్షణంలో ప్రతిపక్ష నాయకుడు ఇలా చెయ్యడం ఏంటి అని చర్చించుకుంటున్నారు. జగన్ కు ప్రాధాన్యత లేని చోటకు ఎందుకు వెళతారు అని కూడా వినిపిస్తోంది. వేమన చెప్పినట్లు అనువు గాని చోట అదికులమనరాదు అన్న మాటను జగన్ ఆచరిస్తున్నట్లున్నారు. అందుకే జగన్ ఆ కార్యక్రమానికి రావడం లేదని తెలుస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles